కడుపులో కత్తెర మరచిపోయారు

SCISSOR IN STOMACH

  • నిమ్స్ వైద్యుల నిర్వాకం
  • మూడు నెలల తర్వాత బటయపడిన విషయం

ఆపరేషన్లు చేసినప్పుడు రోగి పోట్టలో సూదులు, బ్లేడ్లు, సిరంజిలు, దూది తదితరాలు మరచిపోయి కుట్లు వేసిన సంఘటనలు గతంలో చూశాం. ఆపరేషన్ పూర్తయి రోగి ఇంటికి వెళ్లిపోయిన తర్వాత కడుపునొప్పి రావడంతో ఇలాంటివి వెలుగుచూసేవి. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లోకి ప్రఖ్యాత నిమ్స్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఓ మహిళా రోగికి ఆపరేషన్ చేసిన వైద్యులు ఏకంగా ఓ పెద్ద సైజు కత్తెరనే ఆమె కడుపులో పెట్టి కుట్లు వేసేశారు. ఆమె ఇంటికి వెళ్లిన తర్వాత కడుపు నొప్పి రావడం.. అది ఎంతకీ తగ్గకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఎక్స్ రే తీస్తే అసలు విషయం బయటపడింది. దీంతో ఆమె బంధువులు నిమ్స్ ఆస్పత్రికి వచ్చి వైద్యుల నిర్లక్ష్యంపై ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌కు చెందిన మహేశ్వరి (33) అనే మహిళకు మూడు నెలల క్రితం నిమ్స్ లో ఆపరేషన్‌ జరిగింది. అనంతరం డిశ్చార్జి ఇంటికి వెళ్లిపోయింది. అయితే ఆ తర్వాత ఆమెకి తరచుగా కడుపు నొప్పి రావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయించింది. అక్కడ ఆమెకు ఎక్స్ రే తీయడంతో కడుపులో కత్తెర ఉన్నట్లు బయటపడింది. దీంతో బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి నిమ్స్ కు వచ్చి విషయం చెప్పగా.. ఆపరేషన్ చేసిన వైద్యులు ప్రస్తుతం అందుబాటులో లేరంటూ సమాధానం ఇవ్వడంతో ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఆమెకు మళ్లీ ఆపరేషన్ చేసి కత్తెర బయటకు తీస్తామని చెప్పారు.

LATEST NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article