ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సర్వేలో సత్తా చాటిన తెలంగాణ పోలీసు శాఖ. స్మార్ట్ పోలీసింగ్‌లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ. ఐదు విభాగాల్లో మొదటి స్థానం, మరో ఐదు విభాగాల్లో రెండో స్థానం, మరో విభాగంలో మూడో స్థానం లో నిలిచిన తెలంగాణ పోలీసులు. పోలిస్ సెన్సిటివిటి, పోలీసుల నిబద్ధత-మంచి ప్రవర్తన, పోలీసుల స్పందన, టెక్నాలజీ ఉపయోగం, అందుబాటులో పోలీసు వ్యవస్థ విభాగాల్లో తెలంగాణకు మొదటి స్థానం. ఫ్రెండ్లీ పోలీసింగ్, నిష్పక్షపాత, చట్టబద్ధ- పారదర్శక పోలిసింగ్, ప్రజల నమ్మకం, జవాబుదారీతనం విభాగాల్లో రెండో స్థానంలో తెలంగాణ. చిత్తశుద్ధి, అవినీతి రహిత విభాగంలో మూడో స్థానంలో నిలిచింది. స్మార్ట్ పోలీసింగ్ పై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో సర్వే నిర్వహించిన ఇండియన్ పోలీస్ ఫౌండేషన్. 2014 డిజిపిల సమ్మేళనంలో స్మార్ట్ పోలిసింగ్ పద్దతులను పాటించాలని ప్రధానమంంత్రి నరేంద్రమోడీ పిలుపు. ఈ పిలుపుకు స్పందించి స్మార్ట్ పోలిసింగ్ నిర్వహిస్తున్న రాష్ట్రాలలో ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సర్వే. ప్రజల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వే నిర్వహించిన ఐపిఎఫ్.