సెప్టెంబర్ 19- అక్టోబర్ 15 వరకు ఐపీఎల్ రెండో దశ

కరోనా కారణంగా అర్ధాంతరంగా ముగిసిన ఐపీఎల్ మ్యాచ్ లను సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 15 వరకు యూఏఈలో మిగిలిన షెడ్యూల్ ను రెండో దశలో నిర్వహించనున్నారు. ఈ రెండో అంకంలో జరిగే మ్యాచ్ ల్లో మరో కొత్త రూల్ తో ఐపీఎల్ క్రికెట్ ప్రపంచానికి పరిచయం చెయ్యడానికి సిద్ధం అయ్యింది… ఇప్పటికే ఈ మేరకు బీసీసీఐ ఐపీఎల్ పాలక మండలి ఈ కొత్త నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో బ్యాట్స్ మెన్ బంతిని స్టాండ్స్ లోకి సిక్సర్ గా పంపితే తిరిగి అదే బంతితో మ్యాచ్ ని కొనసాగించేవారు. కాని తాజా నిబంధనల ప్రకారం బంతి స్టాండ్స్ లోకి వెళితే ఆ బంతిని ఉపయోగించకుండా దాని స్థానంలో కొత్త బంతితో మ్యాచ్ ను కొనసాగించాలని నిర్ణయించారు.ప్రేక్షకుల మధ్యకి బంతి వెళితే ఆ బంతిని ఎవరైనా పట్టుకున్న వారి నుండి బంతికి వైరస్ అంటుకొని ఆటగాళ్ళకు కరోనా సోకే ప్రమాదం ఉన్నందున ఈ కొత్త బంతి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article