పవన్ చేతిపై ఉన్న టాటూ సీక్రెట్..!

Secret Behind Pawan Kalyan Tattoo on his Hand

సీఎం..సీఎం అంటూ జనసైనికులు నినాదాలివ్వడం..దానిపై పవన్ కల్యాణ్ కోపడటం, మరోసారి సీఎం సీఎం అంటూ జనసైనికులు అనడం..దానికి పవన్ కల్యాణ్ అనండి..గట్టిగా సీఎం అంటేనే అవుతా అంటూ మరో మీటింగ్ లో చెప్పడం ఇది పవన్ కే చెల్లుతుంది. నాకో తిక్కుంది..దానిక లెక్కుంది అన్న డైలాగ్ పవన్ కి యాప్ట్ అని చెప్పొచ్చు. కానీ తిక్క ఓకే గానీ లెక్క ఎక్కడ అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. విషయం ఏంటంటే…పవన్ కల్యాణ్ చేతిపై ఓ టాటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పవన్ చేతిమీద ఏపీ సీఎం అనే టాటూ ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతుంది. దీనిపై మీమ్స్‌ కూడా ఓ రేంజ్‌లో వస్తున్నాయి. ‘సీఎం అని టాటూ వేయించుకోవడం ఏంటయ్యా.. ఆంధ్రా సీఎం అని టాటూ బొ***’ అంటూ పవన్ ఫొటోను ట్రోల్ చేస్తున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ మళ్లీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే మూడు సినిమాలు ఫిక్స్ అవ్వగా.. ప్రస్తుతం పింక్ రిమేక్ గా వస్తున్న లాయర్ సాబ్ పట్టాలెక్కింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంది. తరువాత పవన్ క్రిష్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఆ తరువాత పవన్ హరీష్ శంకర్ డైరెక్షన్లో మరో సినిమా చేయబోతున్నాడు.

Secret Behind Pawan Kalyan Tattoo on his Hand,#Pawankalyantattoo,#Name,#Tattoo,#APCMTattoo

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article