పట్టాలు తప్పిన సీమాంచల్

SEEMANCHAL DERAILED IN BIHAR

  • ఆరుగురు మృతి.. 29 మందికి గాయాలు

బీహార్ లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. విరిగిన పట్టాపై వెళ్లడంతో ఓ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. మరో 29 మంది గాయపడ్డారు. బీహార్ లోని జోగ్‌బనీ నుంచి ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌కు వెళుతున్న సీమాంచల్‌ ఎక్స్ ప్రెస్ ఆదివారం వేకువజామున బీహార్ లోని వైశాలి జిల్లాలో పట్టాలు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 11 బోగీలు పట్టాల పై నుంచి పక్కకు పడిపోయాయి. ప్రమాదం జరిగినప్పుడు పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు ఉలిక్కి పడ్డారు. ఏదైనా బాంబు పేలుడు సంభవించిందేమోననే ఆందోళనతో వారంతా వెంటనే అక్కడకు చేరుకున్నారు. రైలు ప్రమాదానికి గురైన విషయాన్ని గుర్తించి సహాయక చర్యలు చేపట్టారు. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. అనంతరం అక్కడకు చేరుకున్న సహాయక బృందాలు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాయి. ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేలు చొప్పున రైల్వే శాఖ పరిహారం ప్రకటించింది.

NATIONAL NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article