అమర జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటాం

SEHWAG AND KTR CONTRIBUTIONS

  • సాయం చేయడానికి ముందుకొస్తున్న ప్రముఖులు
  • వారి పిల్లలను చదివిస్తానన్న సెహ్వాగ్
  • రూ.25 లక్షలు సహాయం అందజేసిన కేటీఆర్

కశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు పలువురు ప్రముఖులు బాసటగా నిలుస్తున్నారు. దేశాన్ని అనుక్షణం రక్షించే మన సైనికులకు ఎంత చేసినా తక్కువే అంటూ తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల పిల్లల చదువు బాధ్యత తనదేనని భారత క్రికెట్‌ జట్టు మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. ‘అమర జవాన్లకు మనం ఏం చేసినా తక్కువే! నేను వారి పిల్లలను చదివించే పూర్తి బాధ్యతను తీసుకుంటా. నా ‘సెహ్వాగ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌’లో వారి చదువుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తా’ అని ట్విట్టర్‌లో వీరూ పోస్ట్‌ చేశాడు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా జవాన్లకు బాసటగా నిలిచారు. ‘భారత్‌ కే వీర్‌’ సహాయనిధికి వ్యక్తిగతంగా రూ. 25లక్షలు విరాళం ఇచ్చారు.  ఈ మేరకు ఆదివారం సీఆర్పీఎఫ్‌ కార్యాలయానికి వెళ్లి చెక్కు అందజేశారు. ‘జవాన్ల గౌరవార్థం నా వంతు సహకారంగా రూ. 25లక్షలు, మా స్నేహితులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చిన మరో రూ. 25 లక్షల చెక్కులను సహాయనిధికి అందించా’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఉగ్రమూకల దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతిచెందగా… తీవ్రంగా గాయాలపాలైన పలువురు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.

NATIONAL NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article