Selam Collector Tick Tock Video Viral
సోషల్ మీడియా తో సెలబ్రిటీలకే కాదు, ఉన్నతాధికారులకు సైతం తిప్పలు తప్పడం లేదు. ఎప్పుడు ఎవరు ఎవరి ఫోటోలతో, ఎవరి వీడియోలతో హల్చల్ చేస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక ఈ మధ్య కాలంలో విపరీతంగా ఆదరణ పొందుతున్న టిక్ టాక్ యాప్ ఒక మహిళా కలెక్టర్ కు తిప్పలు తెచ్చి పెట్టింది.
ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ లో ఓ మహిళా కలెక్టర్ ఫోటోలు వైరల్ గా మారాయి. వీటిని గమనించిన కలెక్టర్ దిగ్భ్రాంతి చెందారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమిళనాడు రాష్ట్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్ర సేలం జిల్లా కలెక్టర్ రోహిణి ఫోటోలను పెట్టి ఒక టిక్ టాక్ వీడియో తయారు చేసి దానిని వైరల్ చేస్తున్నారు. ఈమె ఫొటోలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సినిమా పాటలతో టిక్‌టాక్ యాప్‌లో పోస్ట్ చేశారు. కలెక్టర్ రోహిణి ఫొటోలు, ఆమె కుమారుడి ఫొటోలు కలిపి గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్, ఫేస్‌బుక్, టిక్‌టాక్ మ్యూజిక్, ట్విట్టర్‌లలో పోస్టు చేశారు. దీంతో.. ఆమె ఫోటోలను అందులో పెట్టిన వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కలెక్టర్ రోహిణి ఫోటోలతో ఉన్న టిక్‌టాక్ మ్యూజిక్‌ను నిషేధించే పనిలో సైబర్‌క్రైం పోలీసులు నిమగ్నమయ్యారు. రెండు రోజుల్లో నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు.