ఈటెల పై ఆత్మ గౌరవ దాడి

Self-respect attack on Eetala Rajender, expressed by Mr Kodandaram. He along with Chevella Ex MP Konda Vishweshwar Reddy met Eetala Rajender at his home, discussed various important things related to telangana new age politics.

47
Self-respect attack on Eetala Rajender
Self-respect attack on Eetala Rajender

ఈటెల రాజేందర్ ని కోదండరాం, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు గురువారం ఉదయం కలిశారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ.. ఈటెల రాజేందర్ పైన జరిగిన దాడిని ఆత్మ గౌరవ దాడిగా పరిగణిస్తున్నామని తెలిపారు. ఈటెల రాజేందర్ విషయంలో ఐక్య వేదికగా నిర్మాణం అవ్వాలనే ఆలోచనలో సమావేశం అయ్యామన్నారు. కేసీఆర్ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఐక్య వేదిక నిర్మాణం అనేది ఏ రూపకంగా జరుగుతుందో చూడాలన్నారు. ఈటెల కుటుంభం పై కేసీఆర్ రాజకీయ కక్షలకు దిగుతున్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఒకవేళ ఈటెల రాజేందర్ నిజంగా తప్పు చేసి ఉంటే పార్టీ నుండి ఎందుకు సాస్పెండ్ చేయడం లేదని ప్రశ్నించారు. లేదా అనర్హుడిగా ఎందుకు ప్రకటించడం లేదని అడిగారు. ఇవేవీ చేయడానికి కేసీఆర్ ధైర్యం లేదా? అని నిలదీశారు. ఈటెల విషయంలో మేం ఆయనకు మద్దతుగా నిలుస్తామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here