ఏపీలో ఐపీఎస్ అధికారి సస్పెన్షన్ .. కోర్టుకు?

132
Senior Andhra IPS Officer
Senior Andhra IPS Officer

Senior Andhra IPS Officer Venkateswara Rao Suspended

ఇప్పుడు ఏపీలో ఏపీ ఇంటెలిజెన్స్ బ్యూరో అదనపు డైరెక్టర్ జనరల్ గా పని చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ను సస్పెండ్ చెయ్యటం ఏపీలో దుమారం రేపింది. 1989 బ్యాచ్ కు చెందిన ఆయన ఉమ్మడి ఏపీ క్యాడర్ కు చెందిన వారు. ప్రస్తుతం పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ గా సాగుతున్నారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా చాలా కాలం పని చేసిన అనుభవం ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ఇంటెలిజెన్స్ బ్యూరో అదనపు డైరెక్టర్ జనరల్ గా పని చేసిన అనంతరం ఆయన్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఎన్నికల వేళలో ఆయన తన అధికారాల్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. బదిలీ తర్వాత ఇప్పటివరకూ ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. తాజాగా ఆయనపై ఉన్న ఆరోపణలపై సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇక ఆయన సస్పెన్షన్ వెనుక ఉన్న అసలు కారణం ఏమిటంటే  తాను కీలక పదవిలో ఉన్న వేళలో.. తన కుమారుడు చేతన్ సాయికృష్ణకు చెందిన సంస్థకు సెక్యురిటీ పరికరాల్ని తయారు చేసే కాంట్రాక్టు పనులను ఇప్పించారన్న ఆరోపణలు ఉన్నాయి. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తనపై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ పై తాజాగా స్పందించారు. తన సస్పెన్షన్ పై మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదన్నారు ఆయన .  ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.  ప్రభుత్వ నిర్ణయంతో తాను కుంగిపోనని.. మానసికంగా తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు.
ఈ చర్యను చట్టపరంగా ఎదుర్కొనేందుకు తనకున్న అవకాశాల్ని పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తనపై తీసుకున్న చర్యలపై ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. న్యాయ పోరాటం చేసేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది.

Senior Andhra IPS Officer Venkateswara Rao Suspended,AB Venkateshwar rao

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here