Wednesday, May 14, 2025

రాడిసన్​ డ్రగ్​ కేసులో సంచలనం

క్రోమోటోగ్రఫీ పరీక్షలకు కోర్టులో అనుమతి పిటిషన్

టీఎస్​, న్యూస్​ : రాడిసన్ డ్రగ్స్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. కేసు నుంచి తప్పించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుంటే.. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీకి వెళ్లిన వారిలో డ్రగ్స్‌ను గుర్తించేందుకు క్రోమోటోగ్రఫీ పరీక్షలు నిర్వహిం చేందుకు పోలీసుల ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం కూకట్‌పల్లి కోర్టును పోలీసులు అనుమతి కోరారు. న్యాయస్థానం అనుమతి ఇవ్వకపోవడంతో పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు.

డ్రగ్స్ కేసులో నిందితులను గుర్తించేందుకు కొంతమందికి క్రోమోటోగ్రఫీ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలని హైకోర్టును కోరుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ పార్టీ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో నిందితులుగా మొత్తం 14 మందిని గుర్తించారు. వీరిలో ముగ్గురు మాత్రమే డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్దారణ అయింది. కొంతమంది సెలబ్రెటీస్ సమయం తీసుకుని విచారణకు రావడంతో.. వారి నమూనాల్లో డ్రగ్స్ ఆనవాలు కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. వారి శరీరాల్లో డ్రగ్స్ గుర్తించేందుకు క్రోమోటోగ్రఫీ పరీక్షలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి క్రోమోటోగ్రఫీ పరీక్ష చేయలేదు.

అసలేం జరిగిందంటే..
గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్‌ తీసుకున్న కొందరు యువకులను ఫిబ్రవరి 26వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. రాడిసన్ హోటల్‌లో సదరు యువకులు గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నారు. వారిలో ఒక ప్రముఖ బీజేపీ నేత కుమారుడితో పాటు వ్యాపారవేత్త కుమారుడు, మరికొంతమంది సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. యువకులు పెద్ద ఎత్తున డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు రాడిసన్ హోటల్‌పై దాడి చేశారు. డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించి ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మరికొంతమంది సినీ రంగానికి చెందిన ప్రముఖులకు విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపించిన విషయం తెలిసిందే.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com