దిశా కేసు ఫోరెన్సిక్ నివేదికలో సంచలన నిజాలు

Sensational Facts In Disha Case Forensic Report

దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దిశ ఘటన ఎన్‌కౌంటర్ విషయంలో పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఎన్‌కౌంటర్ సరైందే అంటూ మెజార్టీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తుండగా, ఫేక్ అంటూ ప్రజా సంఘాలు, పౌర హక్కుల నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ సుమోటోగా కేసును తీసుకొనగా, మరోవైపు సుప్రీం కోర్టు విచారణ నిమిత్తం ముగ్గురు సభ్యులతో కమిషన్‌ను నియమించింది. డిసెంబరు 6 న ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మహ్మద్ అరీఫ్, జోలు శివ, జోలు నవీన్.. చింతలకుంట చెన్నకేశవలు అనే నలుగురు నిందితులు దిశపై అత్యాచారం చేశారని ఫోరెన్సిక్ నివేదికలు తేల్చాయి. బాధితురాలి వస్త్రాలపై స్పెర్మ్ మరకలు కూడ ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభ్యమయ్యాయి.  విశ్రాంత న్యాయమూర్తులు వీఎస్ సిర్పుర్కార్, రేఖ, మాజీ సీబీఐ అధికారి కార్తికేయన్‌లు ఈ కమిషన్‌లో ఉన్నారు.

మరోవైపు దిశ నిందితుల విషయంలో పోలీసులకు కీలక ఆధారాలు లభిస్తున్నాయి. దిశ లివర్‌లో ఫోరెన్సిక్‌ నిపుణులు లిక్కర్‌ను గుర్తించినట్లు సమాచారం. అత్యాచారం సమయంలో దిశ నోట్లో బలవంతంగా మద్యం పోసినట్టు నిందితుల విచారణలో వెల్లడైంది. రన్‌వే 44 వైన్స్‌లో వారు లిక్కర్‌ కొనుగోలు చేసినట్టు పోలీసులు ఇప్పటికే సీసీ ఫుటేజ్‌ సేకరించారు.

నవంబర్ 27 న దిశ.. తోండుపల్లి టోల్ ప్లాజా సమీపంలో సాయంత్రం 6 గంటలకు తన స్కూటీని పార్క్ చేసి, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్ కోసం వెళ్లింది. ఆ తర్వాత రాత్రి 9.30 గంటలకు నేరుగా టోల్ ప్లాజా వద్దకు చేరుకుంది. ఈ మధ్యలో ఆమె ఎక్కడా ఆగలేదు. కాబట్టి ఆ నలుగురు నిందితులే ఆమెను బలవంతంగా మద్యం తాగేలా చేశారని.. పోలీసులు రిపోర్ట్ రెడీ చేస్తున్నట్టు సమాచారం.

tags: disha case, tondupalli , forensic report, liver, liquor, cctv footage

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *