సేవాభారతి ఉచిత అంబులెన్స్ సేవలు

96


సేవా భారతి ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్‌ సేవలు ప్రారంభమయ్యాయి. ఉచిత అంబులెన్స్ సేవలు కావాలనుకునేవారు 040-48213100 నంబర్‌ను సంప్రదించాలని సేవాభారతి ప్రతినిధులు తెలిపారు. బర్కత్‌పురా కేశవనిలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సేవాభారతి ప్రాంత అధ్యక్షుడు దుర్గారెడ్డి, కార్యదర్శి ప్రభల రామ్మూర్తి, సహ కోశాధికారి మంజూషా, చలసాని మాలతి స్మారక సమితి మేనేజింగ్ ట్రస్టీ చలసాని బలరామ్ ప్రసాద్, ఆర్ఎస్ఎస్ క్షేత్ర సేవా ప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్, క్షేత్ర ధర్మజాగరణ ప్రముఖ్ ఆలె శ్యామ్ కుమార్, తెలంగాణ ప్రాంత సహ సంఘ్ చాలక్ సుందర్ రెడ్డి, ప్రాంత ప్రచారక్ దేవేందర్ రెడ్డి, సహప్రాంత ప్రచారక్ శ్రీధర్, ప్రాంత సేవా ప్రముఖ్ వాసు, ఇతర సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

సేవా భారతి ఇటీవలే హైదరాబాద్ నగర శివార్లలోని అన్నోజిగూడలో ఉచిత కోవిడ్ ఐసొలేషన్ సెంటర్ ప్రారంభించింది. 200 పడకల ఈ కేంద్రంలో పెద్ద సంఖ్యలో డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, యోగా సిబ్బంది కోవిడ్ పేషంట్లకు సేవలందిస్తున్నారు. ఈ కేంద్రంలో ఇప్పటికే వందలాది మంది చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ స్వల్ప లక్షణాలు కలిగి ఉండి అన్నోజిగూడ ఉచిత కోవిడ్ ఐసొలేషన్ సెంటర్‌లో అడ్మిట్ కావాలనుకునేవారు ముందుగా 040-48212529 నెంబర్‌ను సంప్రదించాలని సేవాభారతి ప్రతినిధులు సూచిస్తున్నారు. అంతేకాదు కోవిడ్‌కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా తీర్చేందుకు సలహా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సలహా కేంద్రంలో వైద్యులు ఆన్‌లైన్ ద్వారా సలహాలందిస్తారు. ప్రతిరోజూ వేలాది మంది ఫోన్ చేసి తమ సందేహాలు తీర్చుకుంటున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి పదిలోగా 040-48213100 నెంబర్‌కు ఫోన్ చేసి కోవిడ్ చికిత్సపై వైద్యుల సలహాలు తీసుకోవచ్చుని సేవా భారతి ప్రతినిధులు తెలిపారు.

అటు వరంగల్ అర్బన్ జిల్లాలోని హంటర్ రోడ్‌లోని శ్రీవ్యాస ఆవాసంలో సేవా భారతి, యూత్ ఫర్ సేవా సంయుక్తంగా నగరానికి చెందిన ‘వర్చుస’ సంస్థ సహకారంతో 30 పడకల ఉచిత ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. రెండు ఎకరాల ఆహ్లాదకరమైన వాతావరణంలో, 24 గంటలు పనిచేసే జనరేటర్, ఎయిర్ కూలర్లతో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉచిత వసతి, పౌష్టికాహార భోజనంతో పాటు మందులు అందజేస్తున్నారు. ఈ కేంద్రంలో డాక్టర్ల పర్యవేక్షణ, అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులో ఉంచారు. కరోనా బారిన పడిన పేద కుటుంబాల వారు, చిన్న గదులలో అద్దెకుంటూ ఇబ్బంది పడుతున్న స్వల్ప లక్షణాలు కలిగిన 60 సంవత్సరాల లోపు కోవిడ్ పేషెంట్లు 7207416163 మొబైల్ నెంబర్‌కి ఫోన్ చేసి ఈ కేంద్రంలో చేరవచ్చని సేవాభారతి ప్రతినిధులు తెలిపారు.

కరోనా మహమ్మరి వేళ నిరుపేదలను దృష్టిలో ఉంచుకుని సేవాభారతి అందిస్తున్న సేవలను అంతా మెచ్చుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here