ప్ర‌ముఖ వ్యాపారులు డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్‌

హైద‌రాబాద్‌లో ప్ర‌ముఖ వ్యాపారులుగా చెలామ‌ణి అవుతున్న నిరంజ‌న్ జైన్‌, ఆనంద్, బండి భార్గవ్, వెంకట్ చలసాని, రియల్ ఎస్టేట్ వ్యాపారి శాశ్వ‌త్ జైన్‌, కాంట్రాక్టర్ దండు సూర్య సుమంత్ రెడ్డి, తమ్మినేద సాగర్ త‌దిత‌రుల్ని పోలీసులు డ్ర‌గ్స్ కేసులో శుక్ర‌వారం అరెస్టు చేశారు. వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ డ్రగ్స్ కు అలవాటు పడ్డ నిరంజన్ జైన్ ప‌లు ప్రభుత్వ ప్రాజెక్టు పనుల్ని చేస్తున్నారు. నాలుగు సంవత్సరాల నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ వాడిన వ్యాపారవేత్త నిరంజన్ జైన్. సుమారు 30 సార్లు డ్ర‌గ్స్ తెప్పించుకున్న‌ట్లు అంగీకారం. నిరంజన్ జైన్ ఇచ్చే పార్టీలో కూడా ఉన్నట్లుగా పోలీసులు అనుమానం. ముంబై డ్రగ్ మాఫియా డాన్ టోనీతో వ్యాపారవేత్తలకు సంబంధాలు ఏర్ప‌డ్డాయి. వీరంతా టోనీ మనుషుల చేత నిత్యం డ్రగ్స్ తప్పించుకుంటున్నారు.

ఆనంద్ పాత బస్తీ కేంద్రం గా నడుస్తున్న మసాలా దినుసుల ఫ్యాక్టరీకి మేనేజింగ్ డైరెక్ట‌ర్‌. త‌ను మసాలా దినుసులతో ప్రతి ఏడాది వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాడు. మూడు సంవత్సరాల నుంచి టోనీ గ్యాంగ్ చేత డ్రగ్స్ తెప్పించుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి శాశ్వ‌త్ జైన్.. హైదరాబాదుతో పాటు ఆంధ్రా లో పెద్ద ఎత్తున రియల్ వ్యాపారాలు చేస్తున్నాడు. శంషాబాద్ లోని వందల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. దండు సూర్య సుమంత్ రెడ్డి పలు ప్రభుత్వ కాంట్రాక్టర్లను నిర్వ‌హిస్తున్నాడు. నిరంజన్ జైన్, సుమంత్ రెడ్డి కలిసి హైదరాబాదులో బ్రిడ్జిల నిర్మాణం చేప‌ట్టారు. బండి భార్గ‌వ్ తెలుగు రాష్ట్రాల్లో ప‌లు కాంట్రాక్ట‌ర్లు చేస్తుండ‌గా.. ప్రముఖ ఎగుమ‌తుల వ్యాపారి అని పోలీసులు చెబుతున్నారు. త‌ను వెంకట్ తో క‌లిసి భాగస్వాములుగా ఎగుమ‌తుల వ్యాపారంలో ఉన్నారు. ఈ ఇద్ద‌రు క‌లిసి హైదరాబాద్ లోని అంతర్జాతీయ స్కూల్లో చదువుకున్నారు. వంద‌ల కోట్ల వ్యాపారాన్ని నిర్వ‌హిస్తున్నారు. చ‌ల‌సాని వెంక‌ట్ తండ్రి కూడా పెద్ద కంట్రాక్ట‌రే. మ‌రో వ్యాపార‌వేత్త తమ్మినేద సాగర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.

  • ఏడు మంది వ్యాపారుల్ని కోర్టులో హాజరుపర్చ‌గా.. రిమాండ్ కు తరలించారు. వీరు 14 రోజులు రిమాండ్‌లో ఉంటారు. ప్ర‌తి 15 రోజులకోసారి ముంబై బ్యాచ్ హైదరాబాద్కి టోనీ పంపిస్తున్నాడు. వీరు ఇక్క‌డ ఓయో రూములో మకాం వేసి వ్యాపారవేత్తలకు డ్రగ్స్ అమ్ముతున్నారు. టోనీకి నమ్మకం ఉన్నా 60 మంది యువకుల చేత డ్రగ్స్ వ్యాపారం య‌ధేచ్చ‌గా కొన‌సాగుతోంది. పోలీసులకు చిక్కకుండా కొత్త కొత్త పంథాలో హైద‌రాబాద్‌కి డ్ర‌గ్స్ తీసుకొచ్చి వ్యాపారుల‌కు ఒక గ్రామ్ కొకైన్‌ను ఇర‌వై వేల చొప్పున విక్ర‌యిస్తున్నాడు. అరెస్ట‌యిన వ్యాపారులు ప్ర‌తిసారి భారీ స్థాయిలో డ్ర‌గ్స్ కొనుగోలు చేశారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article