మధుమేహం వ‌ల్ల వ‌చ్చే లైంగిక సామ‌ర్థ్య లోపం

మధుమేహం వ‌ల్ల వ‌చ్చే లైంగిక సామ‌ర్థ్య లోపం- దీన్ని త‌క్కువ‌గా అంచ‌నా వేస్తున్నా.. ముఖ్య‌మైన స‌మ‌స్య‌: డాక్టర్ ఉదయ్ లాల్

– 2020 ప్రారంభం నుంచి ఈ కేసులలో కనీసం 10% పెరుగుదలను గమనించిన అమోర్ ఆసుపత్రుల వైద్యులు, లైంగిక జీవితంపై ఆసక్తిని కోల్పోతున్న మధుమేహ వ్యాధిగ్రస్తులు

హైదరాబాద్, జూన్ 22, 2022: లైంగిక జీవితంపై ఆసక్తి కోల్పోతున్న మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య 2020 ప్రారంభం నుంచి కనీసం 10 శాతం పెరిగిందని నగరంలోని ప్ర‌ముఖ మల్టీ స్పెషాలిటీ ఆస్ప‌త్రి అయిన అమోర్ హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు. కొవిడ్ -19 మహమ్మారి, తదనంతర లాక్‌డౌన్ వ‌ల్ల నిశ్చల జీవనశైలి దేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరగడానికి దారితీసింది. ఇది పురుషులు, మహిళల లైంగిక ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.

మ‌ధుమేహం అనేది దీర్ఘకాలిక వ్యాధి, ఇది పాశ్చాత్య దేశాల వారి కంటే చాలా ముందుగానే భారతీయ జనాభాను ప్రభావితం చేస్తుంది. దీనివ‌ల్ల లైంగిక సామ‌ర్థ్యం త‌గ్గ‌డంతో పాటు.. ఇంకా ప‌లు స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. ఇది ప్ర‌జ‌ల జీవన నాణ్యతను తగ్గించడానికి కార‌ణ‌మవుతోంది. మ‌ధుమేహం దుష్ప్ర‌భావాల్లో త‌క్కువ‌గా తెలిసిన‌వాటిలో ఇదొక‌టి. పురుషుల్లో అంగస్తంభన లోపం సాధారణ జనాభా కంటే మధుమేహంతో బాధపడుతున్న వారిలో దాదాపు మూడు రెట్లు ఎక్కువ. దీనివ‌ల్ల శారీరక సంక్లిష్టతల నుంచి మానసిక అసమతుల్యత వరకు జీవితంలోని ప‌లు అంశాల్లో ప్రభావం ప‌డుతుంది.

2045 నాటికి భారతదేశంలో 145 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతుంటారని అంచనా! గుండె జబ్బులు, స్ట్రోక్ లు, మూత్రపిండాల వైఫల్యం, అంధత్వం, కొన్ని సందర్భాల్లో చేతులు, కాళ్ల‌ను తీసేయాల్సి రావ‌డానికి కూడా మధుమేహం ప్రధాన కారణం అవుతోంది. పురుషులు, మహిళల లైంగిక ఆరోగ్యంపై దాని ప్రభావం గురించి ఎవ‌రూ పెద్ద‌గా మాట్లాడ‌రు, చ‌ర్చించ‌రు.

ఈ ప్రభావం గురించి అమోర్ ఆసుప‌త్రి ఇంటర్నల్ మెడిసిన్ విభాగం చీఫ్ కన్సల్టెంట్ డాక్టర్ ఉదయ్ లాల్ మాట్లాడుతూ, “డయాబెటిస్ మెల్లిటస్ ఉన్నవారి సంఖ్య క్ర‌మంగా పెర‌గ‌డాన్ని వైద్య‌వ‌ర్గాలు గ‌మ‌నిస్తున్నాయి. వారిలో చాలా మంది చాలా చిన్న వయస్సులోనే మధుమేహంతో బాధపడుతున్నారు. జీవనశైలిలో మార్పులు, జంక్ ఫుడ్స్ వినియోగం, ధూమపానం, మద్యపానం, ఒత్తిడి లాంటివి ఉద్యోగ జీవితంలో ఉన్న‌వారిలో ఈ సమస్యకు ప్రధాన కారణం. ఈ ముప్పును త్వరగా పరిష్కరించకపోతే, రాబోయే సంవత్సరాల్లో భారతదేశ జనాభా సంఖ్యపై ప్రతికూల ప్రభావం ప‌డుతుంది.

టెస్టోస్టెరాన్ అనేది ఒక సెక్స్ హార్మోన్, ఇది సంతానోత్పత్తి, సెక్స్ డ్రైవ్, ఎముకల బ‌రువు, కొవ్వు పంపిణీ, కండరాల బ‌రువు, ఎర్ర రక్త కణాల ఉత్పత్తితో సహా మానవ శరీరంలోని కొన్ని ప్రక్రియలను నియంత్రిస్తుంది. పెరుగుతున్న డయాబెటిస్ స్థాయి, టెస్టోస్టెరాన్ స్థాయిపై దాని ప్రతికూల ప్రభావాల మధ్య సంబంధాన్ని కొంతమంది పరిశోధకులు కనుగొన్నారు. 2020 ప్రారంభం నుంచి, లైంగిక కార్యకలాపాల పట్ల ఆసక్తిని కోల్పోతున్నట్లు ఫిర్యాదు చేసే యువకుల సంఖ్య 10% పెరగ‌డాన్ని మేము గ‌మ‌నించాము. వీరిలో చాలామందికి మ‌ధుమేహం చాలా ఎక్కువ స్థాయిలో ఉన్న‌ట్లు ప‌రీక్ష‌ల్లో తేలింది. మధుమేహం వల్ల కొన్ని నరాలు మరియు రక్తనాళాలు దెబ్బతిని.. త‌ద్వారా లైంగిక సామ‌ర‌ర్థ్యం త‌గ్గ‌డం అనే ల‌క్ష‌ణం క‌నిపిస్తుంది” అని డాక్టర్ ఉదయ్ లాల్ అన్నారు.

దేశంలో, సమాజంలో పెరుగుతున్న మ‌ధుమేహ స‌మ‌స్య‌ను పరిష్కరించడానికి అవగాహన అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. భారతీయ జనాభా భవిష్యత్తుపై ప్రభావం చూపించే ఈ తీవ్రమైన సమస్యపై అవగాహన పెంచడానికి వైద్య‌, ఆరోగ్యరంగ నిపుణులు గ‌ట్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. తగినంత నిద్ర, ధూమపానం మానుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవ‌డం లాంటి ఆరోగ్యకరమైన జీవనంతో పాటు.. జీవనశైలి మార్పులు కూడా మ‌ధుమేహ స్థాయిని నియంత్రించడానికి బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇది శారీరకంగా ఆరోగ్యకరమైన, లైంగికంగా చురుకైన జీవితాన్ని అందిస్తుంది.

అమోర్ ఆస్ప‌త్రి గురించి:
ప‌లువురు వైద్య‌నిపుణులు, వైద్య‌రంగ నిపుణులు క‌లిసి నాణ్య‌మైన వైద్య‌సేవ‌లు అందించాల‌న్న త‌ప‌న‌, నిబ‌ద్ధ‌త‌తో ఏర్పాటుచేసిన‌దే అమోర్ ఆస్ప‌త్రి. అమోర్ ఆస్ప‌త్రి ప్రధాన విలువలు దాని పేరుకు ఉన్న‌ అర్థంతో ప్రతిధ్వనిస్తాయి. ప్రేమ, సహానుభూతి, సంరక్షణతో రోగులకు సేవ చేయడంపైనే మా దృష్టి అంతా ఉంటుంది. నాణ్యమైన చికిత్స‌ల‌కు, ఆర్థిక స్థోమ‌త‌కు మ‌ధ్య ఉన్న అంతరాన్ని పూడ్చాలనే లక్ష్యంతో, అమోర్ ఆస్ప‌పత్రి రోగి సంరక్షణ కోసం అంత‌ర్జాతీయ స్థాయి ప్రమాణాల‌ను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించింది. డాక్టర్ కిశోర్ బి. రెడ్డి నేతృత్వంలోని అమోర్ ఆస్ప‌పత్రి రోగ నిర్ధారణ, చికిత్సలో రోగికే అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఇది చికిత్స విధానాల‌కు వెన్నెముక లాంటిది. దీన్ని పాల‌నావ్య‌వ‌స్థ‌లో అంత‌ర్భాగం చేయ‌డం రోగులు, వారి కుటుంబాలతో మా సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి దోహదపడుతుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article