శింబు కాదు.. సిద్ధార్థ్‌

Shankar Indain 2 Shoots from tomorrow
క‌మ‌ల్ హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రేప‌టి నుండి చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోబోతున్న భారీ బ‌డ్జెట్ చిత్రం `ఇండియ‌న్ 2`. లంచ‌గొండుల భ‌ర‌తం ప‌ట్టిన సేనాప‌తిగా క‌మ‌ల్ హాస‌న్ మ‌రోసారి వెండితెర‌పై సంద‌డి చేయ‌బోతున్నారు. ఈ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ మ‌న‌వ‌డి పాత్ర‌లో సిద్ధార్థ్ న‌టించ‌బోతున్నార‌ట‌. ముందుగా ఈ పాత్ర‌ను శింబు చేస్తున్నాడ‌ని వార్త‌లు వినిపించాయి. అయితే లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఆ పాత్ర‌లో సిద్ధార్థ్ న‌టించ‌బోతున్నాడ‌ట‌. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `బాయ్స్‌` చిత్రం ద్వారా హీరోగా ప‌రిచ‌య‌మైన సిద్ధార్థ్‌.. మ‌రోసారి శంక‌ర్‌తో క‌లిసి ప‌నిచేస్తున్నాడు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article