Shankar to Make MULTI STARRER Movie
`ఇండియన్ 2` సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే తమిళ దర్శకుడు శంకర్ మరో సినిమాకు సంబంధించిన ప్లాన్స్ సిద్ధం చేసేసుకుంటున్నాడట. అది కూడా ఓ మల్టీస్టారర్. ఇంతకు ఆ మల్టీస్టారర్‌లో హీరోలు ఎవరో తెలుసా? తమిళ అగ్ర కథానాయకుల్లో ఒకరైన విజయ్ తనయుడు జాసన్ విజయ్.. వైవిధ్యమైన సినిమాలు చేసే చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్. వీరి కలయికలో సినిమా చేయడానికి శంకర్ కథను సిద్దం చేస్తాడట. అంతా ఓకే అయితే 2020లో ఈ సినిమాను ప్రకటిస్తారు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఇప్పుడు కమల్ హాసన్‌తో `ఇండియన్ 2` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కొన్ని కారణాలతో ఈ సినిమా షూటింగ్‌ను శంకర్ ఆపాడని వార్తలు వినపడుతున్నాయి.
మల్టీస్టారర్ ఆలోచనలో శంకర్…
