విశాఖ శ్రీ శారదాపీఠంలో శంకర జయంతి వేడుకలు

విశాఖ శ్రీ శారదాపీఠంలో శంకర జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర చేతులమీదుగా విశేష పూజలు నిర్వహించారు. స్వరూపానందేంద్ర మాట్లాడుతూ ఆది శంకరులు అవతరించకపోతే భారతదేశం అతలాకుతలమయ్యేది. హైందవ జాతిని నిలబెట్టిన అవతారమూర్తి ఆదిశంకరులని అన్నారు. ఆదిశంకరులు అందరివాడు…ఏ వర్గానికో పరిమితం కాదు. వైష్ణవులు, శైవుల మధ్య భేదాలు సృష్టించే ఉన్మాదులు మళ్ళీ తయారయ్యారు. ఈ పరిస్థితుల్లో శంకర తత్వం విస్తృతం కావాల్సిన అవసరముంది. శంకర జయంతిని కేంద్ర ప్రభుత్వం జాతీయ దినోత్సవంగా ప్రకటించాలి. ప్రతి ఇంటా భగవంతునితో సమానంగా ఆదిశంకరుని చిత్రపటం ఉంచాలి. పిల్లలు విద్యాలయాలకు వెళ్లే ముందు శంకరాచార్యునికి నమస్కరించండని అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article