శారదా శక్తి పీఠానికి ఆ భూమి క్యాన్సిల్ చెయ్యండని విజ్ఞప్తి

SHARADA SHAKTHI PETTAM LAND ISSUE

శారదా శక్తి పీఠానికి రూపాయికే ఎకరా చొప్పున భూమి ఇవ్వటాన్ని ఆక్షేపిస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు సోషలిస్ట్ పార్టీ నాయకులు . ఆ ప్రభుత్వ భూమిని విద్యా ,హౌసింగ్ లేదా యువతకు ఉపాధి కల్పించేందుకు అందించాలని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా లేఖ రాశారు. కోట్ల ఖరీదు చేసే భూమిని ఒక రూపాయికే స్వామీజీకి ఇవ్వటం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతుందని వారు ఆలేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. హెచ్ డీ ఎంఏ యాక్ట్ ప్రకాటం చట్ట విరుద్ధమైన చర్య అని పేర్కొన్న సోషలిస్ట్ పార్టీ నాయకులు తక్షణం దీన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు.

హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు భూమిని కేటాయించాలని విశాఖ శ్రీ శారదా పీఠం 2015, 2018, 2019 జూన్ 22న దరఖాస్తు చేసింది. ఈ వినతిని పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం రెండెకరాల 34 సెంట్లు భూమిని శారదా పీఠానికి కేటాయించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట గ్రామంలో భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం శనివారం జీవోను జారీ చేసింది. దీనికి నామమాత్రపు ధర ఒక్క రూపాయిగా పేర్కొంది. అయితే, దీని విలువ ఎకరాకు రూ.12 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. కోకాపేట గ్రామ సర్వే నంబరు 240లో భూమిని కేటాయిస్తూ జీవో ఎంఎస్‌ నెం.71ని తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది.

ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. శారదాపీఠం ఆధ్వర్యంలో ఆలయం, వేద భాష గోష్ఠి మఠం, సంస్కృత పాఠశాల, విద్యార్థులకు వసతిగృహం, కన్వెన్షన్‌ హాల్ ఏర్పాటు చేసేందుకు తమకు భూమిని కేటాయించాలంటూ విశాఖ శ్రీ శారదా పీఠం ధర్మాధికారి జి.కామేశ్వరశర్మ 2015, 2018లోనూ, మళ్లీ ఈ నెల 22న ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి సీఎంకీ ప్రతిపాదనలు అందడంతో రెండెకరాల భూమిని కేటాయించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంగీకరించారు.కోకాపేట గ్రామం పరిధిలోని సర్వే నంబరు 240లో 316.04 ఎకరాల పోరంబోకు స్థలం ఉంది. ప్రస్తుతం ఇది హైదరాబాద్‌ నగరపాలక అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఆధీనంలో ఉంది. ఇదే లేఅవుట్‌లో ఖాళీగా ఉన్న 2.34 ఎకరాలను పీఠానికి కేటాయించేందుకు ప్రభుత్వం హెచ్‌ఎండీఏ నుంచి వెనక్కు తీసుకుంది. ఇక్కడ ఎకరా స్థలం మార్కెట్‌ విలువ రూ.12 కోట్లు పలుకుతోంది. ఇక ఈ విషయంలో మరి కేసీఆర్ ఎలా స్పందిస్తారో

POLITICAL NEWS

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article