షర్మిల ప్రభాస్ కేసులో లోతుగా దర్యాప్తు

Sharmila Prabhas Case Enquiry.. ఆరుగురి అరెస్ట్

చాలా కాలంగా సినీ నటుడు ప్రభాస్ తో, వైయస్సార్ తనయ షర్మిలకు సంబంధాలు ఉన్నట్టు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. దీంతో తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ షర్మిల హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు.సినీనటుడు ప్రభాస్‌తో తనకు సంబంధాలున్నట్లు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై సైబర్ క్రైం దర్యాప్తులో వేగం పెంచింది. షర్మిలపై నెగిటివ్ గా ప్రచారం చేసిన వారిలో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
నిందితులు ఆరుగురికి 41(ఎ) నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం 15 సోషల్ మీడియా వెబ్ సైట్లను గుర్తించిన పోలీసులు మిగితావారికి కూడా నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. యూట్యూబ్ నుంచి వివరాల కోసం వేచి చూస్తున్నారు. వివరాలు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైం అదనపు డీసీసీ రఘువీర్ తెలిపారు.
హీరో ప్రభాస్‌తో తనకు సంబంధముందని సోషల్‌ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్‌ షర్మిల ఈ నెల 14న హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దుష్ప్రచారానికి పాల్పడ్డారనే అనుమానాలతో యూట్యూబ్‌లో మొత్తం 15 వీడియో లింకుల్ని పోలీసులు గుర్తించారు. అవి ఏయే ఐపీ అడ్రస్‌ల ద్వారా అప్‌లోడ్‌ చేశారో వివరాలు సేకరించి వాటి ఆధారంగా బాధ్యుల్ని గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరంతా హైదరాబాద్‌ వాసులేనని ప్రాథమికంగా గుర్తించారు. ఇక ఈ కేసు విషయంలో మరింత దూకుడుగా వెళ్లనున్న సైబర్ క్రైమ్ అధికారులు ఈ వీడియో లింక్ లను అప్లోడ్ చేయడం వెనుక ఇంకా ఎవరికైనా పాత్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద ఫేక్ న్యూస్ పబ్లిక్ చేసే యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలకు ఉపక్రమించారు సైబర్ క్రైమ్ పోలీసులు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article