బాబు టార్గెట్ గా షర్మిల ఫిర్యాదు వెనుక వారి హస్తం

Spread the love

Sharmila Targeted Chandrababu Naidu

నిన్న మొన్నటి దాకా సైలెంట్ గా ఉన్న షర్మిల ఒక్కసారిగా వైలెంట్ గా మారారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాజాగా షర్మిల తీసుకున్న ఒక నిర్ణయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు టార్గెట్ గా షర్మిల చేసిన పనిని చూసి దీని వెనుక కారణం ఏమై ఉంటుంది అని అందరూ ఆలోచనలో పడ్డారు. అయితే షర్మిలకు సపోర్టుగా కేటీఆర్, కవిత ఉన్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇంతకీ షర్మిల ఏం చేశారో తెలుసా

..వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న తన వ్యతిరేక ప్రచారంపై చాలా కాలం తర్వాత తెర ముందుకు వచ్చారు. నిజానికి, ఆమెపై చాలా కాలం క్రితం చాలా అసహ్యంగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై జగన్ వ్యాఖ్యలు చేసినప్పుడు చాలా అసహ్యంగా ఆమెపై ప్రచారం సాగింది.జగన్ కుటుంబ సభ్యుల జోలికి వెళ్లవద్దని ఆ సమయంలో పవన్ కల్యాణ్ తన అభిమానులకు సూచించారు కూడా. అయితే, తాజాగా షర్మిల హైదరాబాదు పోలీసు కమిషర్ అంజనీ కుమార్ కు సోమవారం ఫిర్యాదు చేయడం వెనక తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సూచనలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబుకు కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ లో ఇది తొలి అడుగుగా భావిస్తున్నారు. సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తల పేరు మీద షర్మిలపై ప్రచారం జరిగిందని చెబుతున్నప్పటికీ అదంతా తెలుగుదేశం పార్టీ వ్యవహారమని షర్మిల నేరుగానే ఆరోపించారు. సీపీకి ఫిర్యాదు చేసిన తర్వాత షర్మిల సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై, తెలుగుదేశం పార్టీపై షర్మిల ఆరోపణలు చేశారు. ఐదేళ్ల క్రితం ప్రారంభమైన ప్రచారం మళ్లీ ప్రారంభమైందని ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీని చిక్కుల్లో పడేయడానికి టీఆర్ఎస్ వ్యూహంలో భాగంగానే షర్మిల తనపై జరుగుతున్న ప్రచారంపై పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *