`ఒకే ఒక జీవితం` సక్సెస్‌తో హుషారుగా ఉన్నాడు శర్వానంద్.త్వరలోనే తన ప్రియురాలితో పెళ్లి పీటలెక్కుతుండడం ఆ సంతోషాన్ని రెట్టింపు చేసే విషయం.ఈమధ్యే నిశ్చితార్థం కూడా జరిగింది. ఒకపక్క పెళ్లికి సన్నద్ధమవుతూనే మరో పక్క తన కొత్త సినిమా కోసం రంగంలోకి దిగాడు.ఆయన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.పీపుల్స్ మీడియా ఫాక్టరీ నిర్మిస్తోంది.
ఇటీవలే చిత్రీకరణ షురూ చేశారు.ఎలాంటి సందడి లేకుండా సైలెంట్‌గా ఆయన కొత్త సినిమా కోసం రంగంలోకి దిగడం విశేషం.నిజానికి శర్వానంద్…మరో యువ దర్శకుడు కృష్ణచైతన్యతో ఓ పొలిటికల్ డ్రామా చేయాలనుకున్నారు.ఆ సినిమా ప్రారంభం కూడా అయ్యింది.ఏమైందో ఏమో తెలియదు కానీ… ఆ ప్రాజెక్ట్ ప్లేస్‌లో శ్రీరామ్ ఆదిత్య సినిమా షురూ అయ్యింది. విభిన్నమైన దర్శకుడిగా శ్రీరామ్‌కి పేరుంది. ఆయన చెప్పిన కథకూడా నచ్చడంతో సైలెంట్‌గా పని మొదలుపెట్టేశాడు. ఈ చిత్రంలో శర్వా సరసన కృతిశెట్టి నటిస్తోంది.