గండ్ర రమణారెడ్డి టార్గెట్ గా సీఎంను కలిసిన ఆ మహిళ 

she targets on MLA gandra ramana reddy

సీఎం కేసీఆర్ ని కలవాలంటే పెద్ద పెద్ద నేతలకే తలకి మించిన భారం అవుతుంది. ఒక పట్టాన కేసీఆర్ ఆపాయిన్మెంట్ దొరకదు, ఇక సామాన్య జనాలు కలవాలంటే అది కలలో కూడా జరిగే పని కాదని అందరికి తెలుసు. అందుకే ఒక మహిళా దైర్యం చేసి గోడదూకి సీఎం సెక్యూరిటీని ఛేదించటానికి కష్టపడండి. అసలు విషయం ఏమిటంటే పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తండ్రి చనిపోవటంతో.. ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు వరంగల్ జిల్లా ప్రగతి సింగారం గ్రామానికి కేసీఆర్ వచ్చాడు.
అ సమయంలో ఒక మహిళా ఇంటి గోడను దూకి మరీ లోపలకు వచ్చే ప్రయత్నం చేశారు. దీనితో సీఎం భద్రతా సిబ్బంది ఆమెని వారించే ప్రయత్నం చేశారు. అయిన కానీ ఆమె మొండిపట్టుదలతో భద్రతా సిబ్బందిని ఛేదించుకొని మరీ దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో మరింత అప్రమత్తమైన అక్కడి మహిళా పోలీసులు ఆమెను కిందకు తోసేసి పట్టుకున్నారు. ఈ సంఘటన కేసీఆర్ దృష్టిలో పడేసరికి, ఆయన భద్రతా సిబ్బందికి చెప్పి ఆమెని పిలిపించాడు.
దీనితో సీఎంని కలిసిన సదరు మహిళా తమ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కారణంగా తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి కేసీఆర్ కి పిర్యాదు చేసింది. ఆమె చెప్పిన మాటలు జాగ్రత్త విన్న కేసీఆర్ తగిన న్యాయం చేస్తానని చెప్పి, అక్కడే ఉన్న ఉన్నతాధికారులకు దీనిపై విచారణ చేయాలనీ ఆదేశించాడు. దీనితో ఆమె అక్కడ నుండి వెళ్ళిపోవటం జరిగింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article