అశోక్ గజపతిరాజుకు జగన్ ఝలక్

SHOCK TO ASHOK GAJAPATHI

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు ఏపీ సీఎం జగన్ ఝలక్ ఇచ్చారు. చాలా సంవత్సరాలుగా మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న గజపతిరాజును జగన్ తప్పించారు. అనంతరం ఆ స్థానంలో అశోక్ సోదరుడు, ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయితను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆమెను ప్రభుత్వం ఈ పోస్టులో నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సంచయిత జాతీయ స్థాయిలో బీజేపీ వాయిస్ ను బలంగా వినిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెను మాన్సస్ ట్రస్ట్ పీఠం అప్పగించడానికి ప్రాతిపదిక ఏమిటా అనే ఆరా తీస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దల సూచనలతోనే జగన్ ఈ పదవి ఆమెకు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. పైగా జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులకు సంచయిత మద్దతిచ్చారు. ఇది కూడా ఆమెపై జగన్ సానుకూల వైఖరికి ఓ కారణమని చెబుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పెద్దల సూచనతో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వానీకి తమ కోటాలో రాజ్యసభ సీటు ఇవ్వడానికి జగన్ అంగీకరించారు. తాజాగా సంచయితకు మాన్సస్ ట్రస్ట్ చైర్ పర్శన్ పదవి అప్పగించారు. ఈ పదవి కోసం వైసీపీలోనే చాలామంది ఆశావహులు ఉన్నప్పటికీ సంచయితను ఎన్నుకోవడం ద్వారా అశోక్ గజపతిరాజును దెబ్బతీసే వ్యూహం కూడా ఉందని తెలుస్తోంది.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article