రాహుల్ కు షాక్ ఇచ్చిన అమేధీ రైతులు

Shock for Rahul Gandhi By Farmer’s … ఎందుకంటే

ఒకపక్క దేశంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాలని ప్రయత్నం జరుగుతోంది. ఇక అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సైతం అధికారం చేజిక్కించుకోవడానికి శక్తులన్నింటినీ కూడగట్టుకుంటుంది. అయితే ఇదే సమయంలో
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సొంత నియోజవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. యూపీలో తన పార్లమెంట్ నియోజవర్గంలోని రైతులు రాహుల్ కు నిరసనలతో స్వాగతం పలికారు. రాహుల్ కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించేందుకు రాహుల్ గాంధీ బుధవారం అమేథీలో పర్యటించారు. కానీ, అక్కడి రైతులు నిరసనల స్వరంతో రాహుల్.. ఇక్కడ ఉండేందుకు అర్హుడివి కాదు.. వెంటనే ఇటలీకి తిరిగి వెళ్లిపో అంటూ నినదించారు. రాజీవ్ గాంధీ ఫాండేషన్ తమ భూములను లాక్కొందని రైతుల ఆరోపిస్తున్నారు. రాహుల్ తమ భూములను లాక్కొన్నారని వాపోయారు. లాక్కొన్న భూములను వెంటనే తమకు ఇచ్చేయాలని, లేదంటే తమకు ఉపాధి కల్పించాల్సిందిగా రాహుల్ ను రైతులు డిమాండ్ చేశారు. సామ్రాట్ సైకిల్ ఫ్యాక్టరీ దగ్గర రైతులంతా నిరసన గళం వినిపించారు.
1980లో జైన్ బ్రదర్స్ ఇండ్రస్ట్రీయల్ నిర్మాణం కోసం అమేథిలోని కౌషార్ ప్రాంతంలో 65.57 ఎకరాల భూమిని తీసుకుంది. కానీ, అది వర్క్ ఔట్ కాకవడంతో ఆ భూమిని 2014లో వేలం వేశారు. ఈ వేలంలో రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ స్టాంప్ డ్యూటీ కింద రూ.లక్ష 50వేలకు కొనుగోలు చేసింది. అప్పట్లో ఈ వేలాన్ని చెల్లనిదిగా యూపీఎస్ఐడీసీ పేర్కొంది. దీనిపై విచారించిన గౌరిగంజ్ ఎస్డీఎం కోర్టు ఈ స్థలాన్ని తిరిగి యూపీఎస్ఐడీసీ అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ అధీనంలోనే స్థలం ఉంచుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article