సూర్యకు షాక్ ఇస్తోన్న కోలీవుడ్

24
shock to surya
shock to surya

shock to surya

థియేటర్స్ లేవు. ఎంటర్టైన్మెంట్ లేదు. కానీ కొందరు మాత్రం ధైర్యం చేసి తమ సినిమాలను ఓటిటిలో విడుదల చేస్తున్నారు. కాకపోతే ఇవన్నీ చిన్న సినిమాలే. ఇదే ట్రెండ్ తమిళ్ లో కూడా ఉంది. అయితే.. ఈ సారి ఓ సినిమాతో అక్కడ సరికొత్త గొడవ మొదలైంది. కారణం స్టార్ హీరో సూర్య తన సినిమాను ఓటిటిలో విడుదల చేయాలని నిర్ణయించుకోవడమే. ఇంతకు ముందు కూడా ఇలాంటి గొడవతోనే న్యూస్ లోకి వచ్చిన సూర్యకు ఈ సారి దర్శకుల నుంచి కూడా వ్యతిరేకత వస్తుండటం విశేషం. సూర్యమోస్ట్ టాలెంటెడ్ యాక్టర్. తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న సూర్య లేటెస్ట్ మూవీ ఆకాశమే నీ హద్దురా. తెలుగు మహిళ సుధా కొంగర డైరెక్ట్ చేసిన మూవీ ఇది. ఓ బయోపిక్ తరహా చిత్రం. ఓ సాధారణ మనిషి ఏరోప్లేన్ మేన్ అనిపించుకున్న విధానం నేపథ్యంలో రూపొందిన సినిమా. అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించింది. మోహన్ బాబు లో కీలక పాత్రలో నటించాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేస్తా అంటున్నాడు సూర్య. అదే ఇప్పుడు కోలీవుడ్ లో కొత్త సమస్యలు తెస్తోంది. ఆకాశమే నీ హద్దురా చిత్రానికి నిర్మాత కూడా సూర్యనే. ఇంతకు ముందు కూడా అతను తన భార్య జ్యోతిక ప్రధానా పాత్రలో నటించిన పొన్మగల్ వంథాన్ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేశాడు. అప్పుడూ చాలా గొడవే అయింది.

కానీ అప్పులు పెరుగుతున్నాయనే కారణం చెప్పి విడుదల చేశాడు. జ్యోతిక నటించిన సినిమా కాబట్టి అబ్జెక్షన్స్ ఎక్కువగా రాలేదు. కానీ ఈ సారి తను నటించిన సినిమా విషయంలో కోలీవుడ్ కామ్ గా ఉండటం లేదు. నిజానికి సూర్య సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే అటు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తో పాటు సినిమా ఇండస్ట్రీలోని చాలామంది పెద్దలు కూడా కొత్త ట్రెండ్ కు స్టార్ హీరోలు రూట్ వేస్తే తర్వాతి రోజుల్లో థియేటర్స్ వ్యవస్థ దెబ్బతింటుందని అభ్యంతరం చెబుతున్నారు.  సూర్యతో సూపర్ హిట్ మూవీస్ తీసిన హరి సైతం ఆయనకు ఓ లెటర్ రాశాడు. దేవాలయాల్లాంటి థియేటర్ వ్యవస్థను దెబ్బతీసే నిర్ణయం తీసుకోవద్దు అని కోరాడు. మరి ఈ విషయంలో సూర్య నిర్ణయం ఎలా ఉంటుందో కానీ.. ఓ పెద్ద హీరో ఓటిటిలోకి ఎంటర్ అయితే మిగతా చాలామంది ఆ రూట్ లో వెళతారు. అంత వరకూ బానే ఉంది. కానీ థియేటర్స్ వ్యవస్థ కనుమరుగువుతుంది అనే వాదనలో పస ఎంతనేది అవి ఓపెన్ అయ్యేంత వరకూ వేచి చూస్తే కానీ తెలియదు.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here