విజయ్ కి షాక్ ఇచ్చిన తెలుగు లేడీ డైరెక్టర్ ..?

44
shock to vijay
shock to vijay

shock to vijay

తమిళ్ లో ఇద్దరు స్టార్స్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టింది తెలుగు మహిళా దర్శకురాలు. వెంకటేష్ తో గురు సినిమా చేసిన సుధా కొంగర గుర్తుంది కదా. తను ఇప్పుడు తమిళ్ లో దూసుకుపోతోంది. అఫ్ కోర్స్ తను ముందు నుంచీ అక్కడే దర్శకత్వం చేస్తోంది. ప్రస్తుతం సూర్య హీరోగా నటించిన సూరరై పోట్రుతో రాబోతోంది. తెలుగులో ఈ సినిమా ఆకాశమే నీ హద్దురా అంటూ వస్తోంది. అక్టోబర్ ఫస్ట్ వీక్ లో అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతోందీ చిత్రం. అయితే ఈ సినిమా చేస్తోన్న టైమ్ లోనే ఆమె తమిళ్ సూపర్ స్టార్ విజయ్ కి ఓ కథ చెప్పి ఒప్పించింది. మాస్టర్ తర్వాత విజయ్ చేయాల్సిన సినిమా కూడా సుధా కొంగరదే. ప్రస్తుతం లాక్ డౌన్ పీరియడ్ కాబట్టి.. ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. విజయ్ ఓ లేడీ డైరెక్టర్ కు చాన్స్ ఇవ్వడం కోలీవుడ్ చర్చలకు దారి తీసింది. విజయ్ ఇమేజ్ కు సరిపోయే కథ కావడంతోనే అతను ఒప్పుకున్నాడు అనుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ మేటర్ మరోలా డిస్కషన్స్ లో ఉంది. మధ్యలో ఏమైందో కానీ.. విజయ్ సుధకు నో చెప్పాడట. దీంతో ఇదే కథను కొన్ని మార్పులు చేసుకుని మరో సూపర్ స్టార్ అజిత్ కు చెప్పిందట.

మార్చిన కథ తన ఇమేజ్ కు సరిపోయేలా ఉండటంతో అజిత్ కూడా ఓకే చెప్పాడట. దీంతో ఇదిప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. మామూలుగానే విజయ్ – అజిత్ అభిమానుల మధ్య విపరీతమైన గొడవలు జరుగుతుంటాయి. వీధి రౌడీలకంటే దారుణంగా ప్రవర్తిస్తుంటారు. అజిత్ తనకు ఫ్యాన్స్ అక్కర్లేదు అని చెప్పినా.. వాళ్లు నిరంతరం విజయ్ పై సోషల్ మీడియాలో దాడి చేస్తుంటారు. ఇటు విజయ్ అభిమానులు కూడా అంతే పెద్దగా కారణాలు లేకుండానే అజిత్ ను టార్గెట్ చేస్తుంటారు. మరి ఇప్పుడు విజయ్ కథలో అజిత్ రావడంతో ఈ సారి ఖచ్చితంగా సుధా కొంగరకు ట్రోలింగ్ తప్పదు అంటున్నారు. ఏదేమైనా సుధా తన కెరీర్ కోసం చేసిన పని అభిమానుల మధ్య చిచ్చుగా మారుతుందా అనే చర్చలు జరుగుతున్నాయి కోలీవుడ్ లో.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here