shradda kapoor COMPLETED SAHOO
ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా `సాహో`లో శ్రద్ధా కపూర్ పోర్షన్ పూర్తయింది. మంగళవారం నుంచి ఆమె లండన్‌లో `స్ట్రీట్ డ్యాన్సర్` షూటింగ్‌లో పాల్గొంటుంది. 20 రోజుల పాటు అక్కడే ఆమె చిత్రీకరణ జరగనుంది. సో అక్కడికి వెళ్లడానికి ముందే `సాహో` సంపూర్ణంగా పూర్తి చేసేసింది. లండన్‌కి వెళ్లడానికి గంట ముందు మాత్రమే ఆమె ఇంటికి చేరుకుని, లగేజ్ తీసుకుని తన ఫ్యామిలీకి సెండాఫ్ చెప్పింది. ఈ 20 రోజుల్లో మధ్యలో ఏమైనా గ్యాప్ దొరికితే అప్పుడు కమర్షియల్ యాడ్స్ చేయాలని నిర్ణయించుకుందట. `స్ట్రీట్ డ్యాన్సర్` షూటింగ్ నుంచి తిరిగి వచ్చాక ఆమె నితీష్ తివారి `చిచ్చోర్` సెకండ్ షెడ్యూల్‌లో పాల్గొంటుంది. సో శ్రద్ధకి క్షణం తీరిక లేదన్నమాట. `సాహో` సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. సౌత్ ఇండియన్ భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది. `బాహుబలి`తో ప్రభాస్‌కు వచ్చిన క్రేజ్‌ను ఈ సినిమా మరింత బలంగా పెంచుతోందన్నమాట. అందుకే యువీక్రియేషన్స్ బడ్జెట్‌కు కూడా ఎక్కడా వెనకాడటం లేదు.
For More Click Here
More Latest Interesting news