యూర‌ప్‌కు శ‌ర్వానంద్ `ద‌ళ‌ప‌తి`

Shravanandh to Europe
శ‌ర్వానంద్ హీరోగా సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. సినిమా ఎక్కువ భాగం పూర్త‌య్యింది. లెటెస్ట్ స‌మ‌చారం ప్ర‌కారం ఈ సినిమా యూర‌ప్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌ర‌గాల్సి ఉంది. అందులో భాగంగా మూడు వారాల పాటు సినిమాను స్పెయిన్‌లో చిత్రీక‌రిస్తార‌ట‌. దాంతో మేజ‌ర్ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుందని టాక్‌. ఈ సినిమాలో శ‌ర్వానంద్ రెండు షేడ్స్‌లో న‌టిస్తున్నారు. 1980-90 ద‌శాబ్దానికి చెందిన పాత్ర ఒక‌టి.. ప్ర‌స్తుత ట్రెండ్‌కు అనుగుణ‌మైన గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ హీరోయిన్స్‌గా న‌టిస్తునారు. కాగా.. కల్యాణి 1980-90 పీరియ‌డ్‌లో శ‌ర్వా జోడిగా క‌నిపిస్తున్నారు. ఈ చిత్రానికి `ద‌ళ‌ప‌తి` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article