వేమూరు ఎస్సై అనిల్ కుమార్ దాష్టీకం

  • వేమూరు ఎస్సై అనిల్ కుమార్ దాష్టీకం

    *మైనర్ బాలుడు షేక్ మొహమ్మద్ రఫీ పై దాడి
    *రఫీ పై తలపై కత్తితో రెండు సార్లు కోసిన ఎస్సై అనిల్ కుమార్
    బాపట్ల:వేమూరు ఎస్సై అనిల్ కుమార్ ఒక యువకుడి తలపై కత్తితో కోయడం వివాదస్పదయింది. కొంతమంది యువకుల మధ్య గొడవ అది కాస్త పోలీస్ స్టేషన్లో పంచాయితీకి దారితీసింది. సెటిల్మెంట్ కి రావాలని మహమ్మద్ రఫీ కుటుంబ సభ్యులను ఎస్సై అనిల్ కుమార్ పిలిచాడు. స్టేషన్ కి వచ్చిన వెంటనే రఫీ అనే యువకుడిని గదిలో తీసుకువెళ్లి చితకబాదాడు. ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు కొట్టాడని బాధితుడు అంటున్నాడు. తలపై కత్తితో ఒకసారి కోసిన తెగలేదని,రెండో సారి కొయ్యటంతో తలపై గాయం అయింది. రక్తం కారుతున్నా బయటకు వెళ్ళటం కుదరదని, డాక్టర్ స్టేషన్ కి వచ్చి చికిత్స చేస్తాడని ఇక్కడే ఉండాలని ఎస్ఐ హుకుం జారీ చేసాడు. రక్తం కారడంతో భయంతో రఫీ తండ్రి వద్దకు పరుగు తీసాడు. కొడుకు గాయం చూసి తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తల్లి సృహ కోల్పోయింది. ఒకసారిగా కింద పడటంతో తల్లి తలకి గాయం అయింది. ఆమెను ముందుగా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి, తరువాత గుంటూరు జీజీహెచ్ కి తరలించారు. సెటిల్మెంట్ అవుతుందని గ్రామంలో పెద్దమనుషులు చెబితేనే వేమూరు పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చామని తండ్రి మౌలాలి అంటున్నాడు. తప్పు చేస్తే చట్టప్రకారం కేసులు నమోదు చేయాలి, కాని కత్తితో కొయ్యటం ఏంటని బాధిత కుటుంబికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article