విశాఖ వరాహలక్ష్మీనృసింహస్వామికి ఘనంగా స్వర్ణ సంపెంగలతో ప్రత్యేక అర్చన చేశారు. ఆర్జిత సేవల్లో భాగంగా స్వామివారికి స్వర్ణ పుష్పార్చన చేస్తారు. ఇందులో భాగంగా సుప్రభాత సేవ, ప్రభాత ఆరాధనల తర్వాత ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయదేవేరులతో కల్యాణ మండ పంలోని రజిత సింహాసనంపై అధిష్టిం పజేశారు. ఆలయ ఉప ప్రధానార్చకు డు కేకే ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు అష్టోత్తర శతనామాలు పఠిస్తూ పసిడి సంపెంగలతో పూజలు చేశారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు వేదాశీర్వచనాలు, ప్రసాదాలను అందజేశారు.