సింగం.. ఇంక చాలంటున్నాడేంటీ..?

39
shock to surya
shock to surya

singam new movie

సూర్య .. తమిళ్ నుంచి తెలుగులోనూ మంచి మార్కెట్ తెచ్చుకున్న హీరో. వైవిధ్యమైన కథలతో మన ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాడు. లాంటి పాత్రైనా చేయగల టాలెంటెడ్ సౌత్ హీరోల్లో ఒకడుగా పేరు తెచ్చుకున్న సూర్యను ఊరమాస్ హీరోగా తెలుగు ప్రేక్షకులకు చూపించింది యముడు. పవర్ ఫుల్ పోలీస్ ఇన్స్ పెక్టర్ గా దర్శకుడు హరి టేకింగ్ కు తగ్గ స్పీడ్ తో అదరగొట్టాడు. ఈ సినిమాకు ముందు అతను తమిళ్ లో గౌత్ మీనన్ డైరెక్షన్ లో కాక్క కాక్క అనే స్టైలిష్ కాప్ మూవీతో అద్బుతమైన మార్కులు కొట్టేశాడు. ఇదే సినిమా తెలుగులో వెంకటేష్ హీరోగా ఘర్షణ పేరుతో రీమేక్ అయింది. ఇక యముడుకు సీక్వెల్ గా వచ్చిన సింగం-2 తెలుగులో తమిళ్ కంటే పెద్ద విజయం సాధించడం విశేషం.. ఒక్కో సీక్వెల్ తో సూర్య పాత్రకు ప్రమోషన్స్ పెరుగుతున్నట్టుగా దర్శకుడు హరి రూపొందించిన విధానంతో పాటు మంచి మాస్ కంటెంట్ కూడా తోడవడంతో సింగం -2 సూపర్ హిట్ గా నిలిచింది. అదేఊపులో సింగం-3కూడా విడదలై ఆకట్టుకుంది. కానీ ఈ సినిమా కమర్షియల్ గా ముందు రెండు సినిమాల్లా మెప్పించలేకపోయింది.

లేటెస్ట్ గా గౌతమ్ మీనన్ – సూర్య కాంబినేషన్ లో సినిమా వస్తుందనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పట్లో ఈ కాంబినేషన్ వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు. కారణం.. గౌతమ్ సూర్యతో కాక్కకాక్క కు సీక్వెల్ చేద్దాం అని వెళ్లాడట. కానీ సూర్య మాత్రం ఇప్పట్లో పోలీస్ కథలు చేయను అని ఖచ్చితంగాచెప్పాడట. ఇది విన్న గౌతమ్ ఆశ్చర్యిపోయినా.. అతను కావాలనే ఖాకీ కథలు వద్దంటున్నాడని అర్థం చేసుకున్నాడట. ఎందుకంటే అతను చాలా హోప్స్ పెట్టుకున్న సింగం-3 పోవడంతో పాటు అతను కమెండోగా నటించిన కాప్పాన్ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో.. కొన్నాళ్ల ఖాకీ డ్రెస్ కు గ్యాప్ ఇవ్వాలనుకున్నాడట. అదీ మేటర్.. హిట్ అయితే ఓకే.. పోతేనే ప్రాబ్లమ్ అన్నమాట. మరి సూర్య మళ్లీ ఎప్పుడు పోలీస్ స్టోరీతో వస్తాడో చూడాలి.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here