సింగ‌రేణి కార్మికులకు 61కే రిటైర్మెంట్‌

36
singareni employees retirement age extended
singareni employees retirement age extended

సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 26 తేదీన జరిగే బోర్డు మీటింగ్ లో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండీ శ్రీధర్ ను సిఎం కెసిఆర్ ఆదేశించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు సిఎం పదవీ విరమణ వయస్సుపెంపు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా మొత్తం 43, 899 మంది సింగరేణి కార్మికులు అధికారులకు లబ్ధి చేకూరనున్నది.
రామగుండం నియోజక వర్గ కేంద్రం లో సింగరేణి మెడికల్ కాలేజీ ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలో ఆదేశాలు వెలువడనున్నాయి.
సింగరేణి ప్రాంత సమస్యలు- పరిష్కారాలు అంశం పై ఆ ప్రాంత పరిధిలోని ప్రజా ప్రతినిధులతో ప్రగతి భవన్ లో మంగళవారం సీఎం కెసిఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశం లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, ప్రభుత్వ విప్ మణుగూరు ఎమ్మెల్యే రేగా కాంతారావు, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, భూపాల్ పెల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, కొత్తగూడెం ఎమ్మల్యే వనమా వెంకటేశ్వర్ రావు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఆసీఫాబాద్ ఎమ్మల్యే ఆంత్రం సక్కు, సిర్పూర్ ఖాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప , తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here