SIX MEMBERS RAPED 10TH STUDENT
ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. బాలికలపై అత్యాచారాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గుంటూరుకు చెందిన బాలికను గదిలో నిర్బంధించి ఆరుగురు యువకులు 10రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడిన . గుంటూరు జిల్లాకు చెందిన 16 బాలిక హాస్టల్లో ఉంటూ 10వ తరగతి చదువుకుంటుంది. అక్కడ ఓ కారు డ్రైవర్ పరిచయం అవగా.. అతడి కోసం ఒంగోలుకు వచ్చి అత్యాచారానికి గురైంది. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు ప్రాంతానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని ఒంగోలుకు చెందిన కారు డ్రైవర్‌తో ప్రేమలో పడింది. అతని కోసం 10రోజుల కిందట యువతి ఒంగోలుకు వచ్చింది.
రాత్రి బస్టాండులో దిగి అతడి కోసం వెయిట్ చేస్తూ ఉంది. అతడు ఎంత సేపటికి కూడా రాకపోవడంతో ఫోన్ చేయాలని అనుకుంది. తన వద్ద ఫోన్ లేకపోవటంతో బస్టాండులో ఉన్న వారి దగ్గర నుంచి ఫోన్ తీసుకునేందుకు అందరినీ అడిగింది. ఆమె మిత్రుడు అందుబాటులోకి రాలేదు. ఈ క్రమంలో బస్టాండులో పనిచేసే దివ్యాంగ యువకుడు ఆమెను గమనించాడు. ఆమె స్నేహితుడు తనకు తెలుసు అని చెప్పి మరోసారి ఫోన్ చేయించాడు. ఫలితం లేకపోవడంతో అతడి ఆచూకీ తనకు తెలుసంటూ యువకుడు బాలికను బస్టాండు సమీపంలోని గదికి తీసుకెళ్లాడు. అక్కడికి తన మిత్రుడిని పిలిపించి, ఇద్దరూ కలిసి ఆ రాత్రి ఆమెపై అత్యాచారం చేశారు.
రెండు రోజుల అనంతరం ఆ బాలికను తమ స్నేహితులైన నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులకు అప్పగించారు. ఆ నలుగురు యువకులు బాలికపై మరో కొన్ని రోజులు పాటు దారుణంగా అత్యాచారం చేశారు. వారి నుంచి తప్పించుకుని చివరకు యువతి బస్టాండ్‌కు చేరుకోగా.. అక్కడ ఏడుస్తూ కూర్చొని ఉన్న బాలికను అక్కడ కానిస్టేబుల్ విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉండగా, వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. బాలికను వైద్య పరీక్షలకు తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నిందితులను రహస్యంగా పెట్టి పోలీసులు విచారణ చేస్తున్నారు.