నా బిడ్డ జోలికొస్తే తాట తీస్తా

Smriti Irani Latest Warning

’నా బిడ్డ కరాటేలో సెకండ్‌ డాన్‌ బ్లాక్‌బెల్ట్‌ హోల్డర్.. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండుసార్లు కాంస్య పతకం సాధించింది.. ఎవరైనా ఆమె జోలికెళ్తే తాట తీస్తుంది’ జాగ్రత్త అంటూ కేంద్ర మంత్ర స్మృతి ఇరానీ హెచ్చరించారు. ఇలా ఎందుకు హెచ్చరించాల్సి వచ్చిందంటే.. కుమార్తె ఫొటోను సోషల్ మీడియాలో మంత్రి స్మృతి ఇరానీ పోస్టు చేశారు. దీనిపై ఓ పోకిరి కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు. వెంటనే రెస్పాండ్ అయిన మంత్రి.. ఆ ఫొటోను తొలగించారు. మంత్రి స్మృతి ఇరానీకి కూతురు జోయిష్ ఉంది. జూన్ 22వ తేదీన ఇన్ స్ట్రాగ్రామ్‌లో జోయితో ఉన్న ఫొటోను స్మృతి పోస్టు చేశారు. దీనిపై ఓ వ్యక్తి అవమానించేలా వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయాన్ని జోయిష్.. తల్లికి చెప్పింది. ఫొటోలో జోయిష్ ఎలా ఉందో చెప్పాలంటూ స్నేహితులను అతను రెచ్చగొట్టాడని..తన కూతురు కన్నీరు పెట్టడం తనకిష్టం లేదని మంత్రి స్మృతి ఇన్ స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఆమె సూచన మేరకు ఫొటోను డిలీట్ చేస్తున్నట్లు..తన కూతురి గురించి పోకిరీ తెలుసుకోవాలని..జోయిష్ మంచి క్రీడాకారిణే గాకుండా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిందని తెలిపారు. కరాటేలో సెకండ్ డాన్ బ్లాక్ బెల్ట్ హోల్డర్..ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో రెండు సార్లు కాంస్య పతకం సాధించిందన్నారు. జోయిష్ తల్లి కావడం తనకు గర్వంగా ఉందని చెప్పిన స్మృతి.. ఎవరైనా ఆమె జోలికి వెళ్తే మాత్రం.. తాట తీస్తుంది జాగ్రత్త అంటూ హెచ్చరించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article