రక్తదానంలో గేటెడ్ కమ్యూనిటీలు ముందుండాలి

Cyberabad Police Commissioner VC Sajjanar called on Gated Community residents to donate blood and save the lives of children and the elderly. He was the chief guest at the ‘Treda’ blood donation camp held at SMR Vinay City in Miyapur on Sunday. Speaking on the occasion, Commissioner CP Sajjanar said that Gated Communities must support Treda And SCSC in organizing blood donation camps. He especially lauded the SMR Vinay City residents who bravely stepped forward for blood donation in this covid pandemic.

115

సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్

తలసేమియా, క్యాన్సర్ రోగులకు రక్తం అత్యవసరం

ఎస్ఎంఆర్ వినయ్ సిటీ నివాసితులకు సీపీ అభినందనలు

వరుసగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామన్న ’ట్రెడా‘ విజయసాయి

ఎస్సీఎస్సీ ద్వారా కోవిడ్ రోగులకు ఆపన్నహస్తం

తగ్గిపోతున్న రక్త నిల్వల్ని పెంచేందుకు గేటెడ్ కమ్యూనిటీ నివాసితులు ముందుకొచ్చి రక్తదానం చేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ పిలుపునిచ్చారు. ఆదివారం మియాపూర్లోని ఎస్ఎంఆర్ వినయ్ సిటీలో జరిగిన ‘ట్రెడా’ రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. కరోనా సమయంలో బయటికి ఎవరూ రాకపోవడంతో గేటెడ్ కమ్యూనిటీల్లోకే వెళ్లి రక్తదాన శిబిరాల్ని ‘ట్రెడా’ నిర్వహించడం స్వాగతిస్తున్నానని తెలిపారు. తలసేమియా, క్యాన్సర్ వంటి రోగులకు అత్యవసరమైన రక్తాన్ని గేటెడ్ కమ్యూనిటీలకే వెళ్లి సేకరించడం చక్కటి ఆలోచన అని నిర్వాహకుల్ని ప్రశంసించారు. కొవిడ్ పరిస్థితిల్లో ధైర్యంగా ముందుకొచ్చి రక్తమిచ్చిన ఎస్ఎంఆర్ వినయ్ సిటీ నివాసితుల్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.

* ఈ సందర్భంగా ట్రెడా ఉపాధ్యక్షుడు మేకా విజయ సాయి మాట్లాడుతూ.. ’ట్రెడా’ సభ్యులున్న ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో వరుసగా రక్తదాన శిబిరాల్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎస్సీ ఎస్సీ, సేవా భారతి ఫౌండేషన్ ల సహకారంతో నిర్వహిస్తున్న ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుల్లో పాల్గొనేందుకు గేటెడ్ కమ్యూనిటీలన్నీ ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్సీఎస్సీ సభ్యుడు శ్రీకాంత్ బాడిగ మాట్లాడుతూ.. గతేడాది నుంచి హైదరాబాద్లోని దాదాపు పదిహేడు బ్లడ్ బ్యాంకులకు అవసరమయ్యే రక్తాన్ని అందజేస్తున్నామని తెలిపారు. కొవిడ్ కాలంలో ప్రజలకు తమ వంతు సహాయాన్ని అందజేస్తున్నామని చెప్పారు. ఐసోలేషన్ సెంటర్లు, ఆక్సిజన్ సెంటర్లు, బెడ్లు, ఆంబులెన్సులు, ప్లాస్మా డొనేషన్ వంటివి విజయవంతంగా చేపడుతున్నామని వివరించారు. ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ వినయ్ సిటీ ప్రెసిడెంట్ కింగ్ జాన్సన్ కొయ్యడ మాట్లాడుతూ.. కొవిడ్ సమయంలో రక్తదానం చేయడానికి ముందుకొచ్చిన తమ సభ్యులకు, నివాసితులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ట్రెడా కోశాధికారి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక్క వ్యక్తి అందజేసే రక్తం వల్ల కనీసం ముగ్గురు పేషెంట్లకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవాభారతి ఫౌండేషన్ సభ్యులు, మియాపూర్ సీఐ వెంకటేష్, సంఘ సభ్యులు తుమ్మల శరత్ బాబు, సురేష్, సతీష్, నిధి గర్గ్, కోరుకొండ సీతారాం తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here