* ఎస్ఎంఆర్‌వీసీ అధ్యక్షుడిగా కింగ్ జాన్సన్ కొయ్యడ
* ఆయన సారథ్యంలోని బృందం రెండోసారి ఎన్నిక
మియాపూర్‌లోని ఎస్ఎంఆర్ వినయ్ సిటీలో ఇటీవల జరిగిన నివాసితుల సంక్షేమ సంఘానికి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతం కార్యవర్గమే మళ్లీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా కింగ్ జాన్సన్ కొయ్యడ రెండోసారి ఎన్నికయ్యారు. ఆయనతో పాటు ప్రసాద్ గోరంట్ల ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా సీతారామ్ కోరుకొండ, ట్రెజరర్‌గా తుమ్మల శరత్ బాబు తదిరులు ఎన్నికయ్యారు. స్కోవా-8లో సెక్రటరీగా సురేష్, జాయింట్ సెక్రటరీ సతీష్, జాయింట్ ట్రెజరర్‌గా నవీన్ వ్యవహరిస్తారు. ఐదు బ్లాకులున్న ఈ కమ్యూనిటీలో 1&3 బ్లాకుకు సింధు, ప్రబల్ బ్లాక్ సెక్రటరీ, బ్లాక్ జాయింట్ సెక్రటరీలుగా వ్యవహరిస్తారు. 2ఏ బ్లాకుకు అశోక్ సోమనీ, అంకుర్ అగర్వాల్.. 2సి బ్లాకుకు దీపక్ ఖత్రి, హిమాంశు సమంతా.. 2బి బ్లాకుకు హిమబిందులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కింగ్ జాన్సన్ కొయ్యడ మాట్లాడుతూ.. గత రెండేళ్ల పాటు తాము చేసిన అభివృద్ధి పనుల్నిగమనించిన నివాసితులే తమ జట్టును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు. వచ్చే రెండేళ్లలో ఎస్ఎంఆర్ వినయ్ సిటీని మరింత మెరుగైన రీతిలో అభివృద్ధి చేస్తామన్నారు. నివాసితులకు ఎలాంటి ఇబ్బందులు రానీయకుండా ఆధునిక సౌకర్యాల్ని నిర్వహిస్తామని చెప్పారు. ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గోరంట్ల మాట్లాడుతూ.. వచ్చే రెండేళ్ల పాటు అభివృద్ధి పనుల్ని చేపట్టేందుకు పక్కా ప్రణాళికల్ని చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం ఎన్నికైన కార్యవర్గం రెండేళ్ల పాటు కమ్యూనిటీ నిర్వహణ బాధ్యతల్ని చేపడుతుంది.
* మియాపూర్‌లోని డీమార్ట్ ఎదురుగా సుమారు ఐదున్నర ఎకరాల్లో దాదాపు పదేళ్ల క్రితం ఎస్ఎంఆర్ సంస్థ ఎస్ఎంఆర్ వినయ్ సిటీ హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీని నివాసితులకు అప్పగించింది. ఐదు వందలకు పైగా ఫ్లాట్లు గల ఈ కమ్యూనిటీలో మినీ క్రికెట్ గ్రౌండ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. బాస్కెట్ బాల్ కోర్టు, టెన్నిస్ కోర్టు, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు, టీటీ వంటి క్రీడా సదుపాయాలున్నాయి. స్విమ్మింగ్ పూల్, ఏసీ జిమ్, పార్టీ హాల్, గెస్ట్ రూమ్స్, రెస్టారెంట్లు వంటివి ఇందులో కొలువుదీరాయి. పదేళ్లయినా మెరుగైన నిర్వహణ కారణంగా ఈ కమ్యూనిటీలో అద్దెలకు మంచి గిరాకీ ఉంది. ప్రస్తుతం 2 బీహెచ్‌కే అద్దె రూ.25,000.. త్రీ బీహెచ్‌కే అద్దె రూ.30,000 ఉంది.