స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం

56
SNDP STARTS IN CITY
SNDP STARTS IN CITY

SNDP STARTS IN CITY

హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అందుకు ప్రధాన కారణమైన నాలాలను అధ్యయనం చేసి, వాటిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు తెలిపారు. మంత్రి సూచన మేరకు మున్సిపల్ శాఖ, జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న నాలాల అభివృద్ధి కోసం స్ట్రాటజిక్ నాల డెవలప్మెంట్ ప్రోగ్రాం (SNDP) కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు నాలలకి ప్రత్యేకించి ఒక నూతన ప్రాజెక్టు విభాగాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. #ktr

సాధారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ వరదతో జలమయం అయ్యేందుకు, ప్రధాన కారణం దశాబ్దాలుగా క్రమంగా కుంచించుకుపోయిన నాలలు, స్త్తాం వాటర్ డ్రెయిన్లు అని వివిధ శాఖల అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఉన్న నాలాల పైన అధ్యయనం చేసి ఎక్కడైతే అత్యంత సంక్లిష్టంగా పరిస్థితి ఉన్నదో, అక్కడ నాలాలను వెంటనే విస్తృత పరిచేందుకు, వాటిపై ఉన్న కబ్జాలను తొలగించి వరద సాఫీగా కిందికి వెళ్లేందుకు అవసరమైన చర్యలను ఈ ప్రాజెక్టు ద్వారా చర్యలు తీసుకోబోతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. కేవలం నాలాలు మాత్రమే కాకుండా ఫీడర్ నాలాలను కూడా ఈ స్ట్రాటజిక్ నాల డెవలప్మెంట్ ప్రోగ్రాం (SNDP) కార్యక్రమంలో భాగంగా పరిశీలించి వాటికి సంబంధించిన అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపడతామని, శీఘ్రగతిన ఈ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటికే ప్రత్యేకంగా రహదారుల కోసం స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ని ఏర్పాటు చేసి మంచి ఫలితాలు రాబట్టిన నేపథ్యంలోనే, ఇదే ప్రయత్నాన్ని , ప్రయోగాన్ని నా లాలా విషయంలోనూ చేపడుతున్నట్లు తెలిపారు. చీఫ్ ఇంజనీర్ మరియు ఇతర సీనియర్ ఇంజనీర్ లతోపాటు సాగునీటి శాఖ ఇంజనీర్లు మరియు వరద నిపుణులు, సాగునీటి శాఖ నిపుణులు ఈ నూతన విభాగంలో భాగస్వాములుగా ఉండబోతున్నారు. వీరంతా కూడా క్షేత్రస్థాయిలో ఉన్న సంక్లిష్ట పరిస్థితులను అర్థం చేసుకుని అందుకు అవసరమైన అన్ని పరిష్కారాలను సూచిస్తూ ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహిస్తూ పరిస్థితులను వేగంగా చక్కదిద్దేందుకు పనిచేయనున్నారు. #ktrtrs

మొన్నటి వరకు హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ గా బాధ్యతలు నిర్వహించిన వసంత ఈ ప్రత్యేక నాలా విభాగాన్ని కి నాయకత్వం వహించనున్నారు. ఈ మేరకు వసంత రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ని స్ట్రాటజిక్ నాల డెవలప్మెంట్ ప్రోగ్రాం (SNDP) సీ ఈ గా నియమించాలని మంత్రి సూచించారు. వీరితో పాటు పలువురు సీనియర్ ఇంజనీర్లను విభాగంలోకి తీసుకొని, సాగునీటి శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మరియు పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్తో కలిసి సమన్వయం చేసుకుంటూ ముందుకుపోవాలని మంత్రి కేటీఆర్ పురపాలక శాఖ మరియు జిహెచ్ఎంసి ఉన్నత అధికారులకు సూచించారు. స్ట్రాటజిక్ నాల డెవలప్మెంట్ ప్రోగ్రాం (SNDP) కి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన జీవో ను మంత్రి ఆదేశాల మేరకు పురపాలక శాఖ విడుదల చేయనున్నది.

SNDP Latest News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here