మోడీ ఎవరో తెలీదన్న ప్రకాష్ రాజ్

Socking Comments by Prakash Raj

ఈమధ్య రాజకీయాల్లో ఎదుటి వారిని విమర్శించడానికి బదులు అసలు వారు ఎవరో తెలీదు? ఆ పేరును పొలిటిషన్ కూడా ఉన్నాడా అంటూ మాట్లాడటం కొంతమంది నేతలకు ఫ్యాషన్ అయిపోయింది. అతను ఎవరో తెలీదు అని చెప్పి అవతల వ్యక్తి గాలి తీసేయడం షరా మామూలైపోయింది. మొన్నటికి మొన్న మెగా బ్రదర్ నాగబాబు బాలకృష్ణ తనకు తెలియదని సంచలన వ్యాఖ్యలు చేస్తే ఇక తాజాగా ప్రకాష్ రాజ్ మోడీ ఎవరైనా తెలియదంటూ సంచలనం సృష్టించారు.
వచ్చే ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని తన రాజకీయ ఆరంగేట్రం గురించి ప్రకటన చేసిన సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఏకంగా తనకు మోదీ ఎవరో తెలియదు అని చెప్పటంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు. భారతదేశం లో ఉండి మన దేశ ప్రధాని ఎవరో తెలియదని ప్రకాష్ చెప్పడం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది.
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ రాజకీయాల్లోకి వస్తానని, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వెంట మోదీ ఎవరో తెలియదనే మాట రావటమంటే.. ఖచ్చితంగా ఆయన మోదీని టార్గెట్ చేసినట్లే అని అర్థమవుతోంది. ‘మోడీనా.. ఎవరాయన..?’ అంటూ రాజకీయ పరంగా ప్రధాని మోదీపై విభిన్నంగా విమర్శనాస్త్రాలు సాధించటం వెనుక ఆయనకు మోడీ పట్ల ఉన్న విముఖత ఏంటో అర్థమవుతుంది.
ప్రకాష్ రాజ్ మాటలు పూర్తిగా గమనిస్తే.. ”గత లోక్ సభ ఎన్నికల్లో ప్రధానిగా మోదీ రావటంతో ఆయనపై నాకు చాలా గౌరవం పెరిగింది. కానీ ఈ ఐదేళ్లలో ఆయన చేస్తున్న పనులు ఒక్కటీ బాగా లేవు. నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు రోడ్డున పడ్డారు. ఆ ప్రభావంతో ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. దాని వల్ల ఎవరికి ప్రయోజనం జరిగిందో ప్రధాని క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఒకే పన్ను అంటే జీఎస్టీని తీసుకు వచ్చారు. దానికి బోలెడు సార్లు మార్పులు చేర్పులు చేస్తూ వచ్చారు. దాంతో కూడా ఎవ్వరికీ ప్రయోజనం చేకూరలేదు. జీఎస్టీ నిర్ణయం తప్పు కాదు. కానీ అందులో ప్లానింగ్ లేకపోవడం పెద్ద లోపం..” అని ప్రకాశ్ రాజ్ అన్నారు. దీన్ని బట్టి చూస్తే.. బీజేపీ విధానాలు, మోదీ పట్ల ప్రకాష్ రాజ్ వ్యతిరేకంగా ఉన్నారని స్పష్టమవుతోంది. మొత్తానికి మోడీ పై షాకింగ్ కామెంట్ చేసి ప్రకాష్ రాజ్ ప్రస్తుతం టాక్ అఫ్ ది టౌన్ అయ్యారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article