సోలో బ్రతుకే సో బెటర్ టీజర్…

158
Solo Brathuke So Better Theme Video
Solo Brathuke So Better Theme Video

Solo Brathuke So Better Theme Video

సాయితేజ్ .. సాయిధరమ్ తేజ్ నుంచి సాయితేజ్ గా మారిన తర్వాత కొత్త విజయాలు అందుకుంటున్నాడు. మారుతి డైరెక్షన్ లో లాస్ట్ ఇయర్ చివర్లో వచ్చిన ప్రతి రోజు పండగేతో సూపర్ హిట్ అందుకున్న తేజ్ ఈ సమ్మర్ లో ‘సోలో బ్రతుకే సో బెటర్’అంటూ వస్తున్నాడు. సుబ్బు అనే దర్శకుడు పరిచయం అవుతోన్న ఈచిత్రం నుంచి ఓ టీజర్ ను విడుదల  చేశారు. ఇంతకు ముందే టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి స్పందన వచ్చింది. అయితే ఈ టీజర్ కూడా రెగ్యులర్ సినిమా టీజర్స్ కు భిన్నంగా వైవిధ్యంగా ఆకట్టుకుంటోంది.

ఓ కాలేజ్ లో స్టూడెంట్స్ ను ఉద్దేశిస్తూ మాట్లాడే యూనియన్ లీడర్ లా సాయితేజ్ ఎంట్రీ జరుగుతుంది. అటుపై అక్కడ ఉన్న వందల మంది స్టూడెంట్స్ ను ఉద్దేశిస్తూ ‘‘కష్టం ఇష్టం విచారం సంతోషం ఆనందం బాధ ఇవన్నీ కాలంతో పాటు కారణాలతో పాటు మారిపోయే ఫీలింగ్స్ అలాగే ప్రేమ అనేది కూడా ఓ పీలింగే కదా.. మారదని గ్యారెంటీ ఏంటి?“ అంటూ సాయితేజ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. సోలో సోదర సోదరీమణులారా.. ఈ వేలెంటైన్స్ వీకెండ్ని మనం అంతా కలిపి జరుపుకుందాం.. మన నినాదం ఒకటే.. సోలో బ్రతుకే సో బెటర్’’ అంటూ కుర్రాళ్లందరితోనూ నినాదం ఇప్పించాడు

ఇక దర్శకుడి ప్రతిభ ఏంటనేది తెలియాలంటే ఈ టీజర్ లో తేజూ వెనక ఉన్న పోస్టర్స్ చూస్తే తెలుస్తుంది. తన కంటెంట్ పై అతనెంత హానెస్ట్ గా ఉన్నాడనేదానికి అవి అద్ద పడతాయి. ఆర్. నారాయణమూర్తి, అబ్దుల్ కలామ్, మదర్ థెరీసా, లతా మంగేష్కర్, అటల్ బిహారీ వాజ్ పేయి ఫోటోస్ ను పెయింటింగ్స్ గా వేయించాడు. మొత్తంగా ఈ సోలో బ్రతుక్కి ఫుల్ స్టాప్ పెట్టే సుందరి ఎవరో కానీ తేజూ మాత్రం ఈ టీజర్ తో ఆకట్టుకున్నాడనే చెప్పాలి.

Solo Brathuke So Better Theme Video,Sai Dharam Tej Latest Updates,Theme Video Of Solo Brathuke So Better,Tollywood Latest News,Tsnews updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here