రైతుబంధు కోసం త‌ల్లిని హ‌త్య

ఎంత దారుణం.. న‌వ‌మాసాలు మోసి పెంచిన త‌ల్లి దారుణంగా హ‌త్య చేశాడో ఓ జులాయి కొడుకు. కేవ‌లం రైతుబంధు, వితంతువు పెన్ష‌న్ కోసం ఆమెను తాగిన మత్తులో క‌డ‌తేర్చాడు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కుదావంద్ పూర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. తల్లి భీమమ్మ (55) మేడకు కరెంట్ వైరు బిగించి హత్య చేశాడు. అత‌ను రైతు బంధు, వితంతు పెన్షన్ కోసం నిత్యం తల్లితో గొడవ పడే వాడని స్థానికులు చెప్పారు. పెస్షన్ డబ్బుల కోసం శుక్ర‌వారం రాత్రి తల్లితో గొడవ ప‌డ్డారు. త‌ల్లిని చంపేస్తే రైతు భీమా వస్తుందని భావించి హత్య చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు. తనే హత్యచేసి తల్లిని ఎవరో చంపారంటూ స్థానికులను నమ్మించే ప్రయత్నం చేశాడు. మద్యం సేవించి జులాయిగా తిరుగుతూ నిత్యం తల్లితో గొడవ పడేవాడని స్థానికులు చెప్పారు. దీంతో, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article