Sonali Bendre once again facing camera
తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ సోనాలి బింద్రే క్యాన్సర్ భారిన పడింది. గత కొంతకాలంగా న్యూయార్క్‌లో క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌ను తీసుకుంది. చికిత్స పూర్తి కావడంతో సోనాలి ముంబై చేరుకున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఈమె సినిమాలకు స్వస్తి పలకకుండా.. వెండితెరపై నటించడానికి సిద్ధమైంది. తాను సెట్స్‌లో అడుగుపెట్టానని సోషల్ మీడియాలో సోనాలి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. “చాలా గ్యాప్ తర్వాత సెట్స్‌లోకి రావడం కలలాగా ఉంది. ఆనందంగా ఫీల్ అవుతున్నాను. కెమెరా ముందు నిలబడ్డప్పుడు ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది“ అన్న సోనాలి.. ఇంతకు ఆమె సెట్స్‌లో జాయిన్ అయ్యారో చెప్పలేదు.