ఎలా ఉంది హన్మంత్?

126

మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావు కు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధి ఫోన్ చేశారు. ఏమైంది.. ఎలా ఉంది హన్మంత్ అని ఆరోగ్య పరిస్థితిని సోనియా గాంధి అడిగి తెలుసుకున్నారు. కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇంతకు, ముందు కరోనో వచ్చింది ఇప్పుడు కాస్త బాగుందని వీహెచ్ సమాధానమిచ్చారు. జీవితం చాలా ముఖ్యమైంది.. ఆరోగ్యం కాపాడుకోవాలని సోనియా సూచించారు.
‘‘మీ ఆశీస్సులు కావాలి’’ అని వీహెచ్ కోరారు. ‘‘మీరు నా మనిషి, కాంగ్రెస్ మనిషి మీరు బాగుండాల’’ని సోనియా కోరారు. నిన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి వేణుగోపాల్ వి. హెచ్ కు కాల్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సోనియా గాంధీకి, కేసి వేణుగోపాల్ కు వి.హెచ్ ధన్యవాదాలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here