అమిత్ షా రాజీనామా చెయ్యాలి…

161
Sonia Gandhi demands resignation of Amit Shah
Sonia Gandhi demands resignation of Amit Shah

Sonia Gandhi demands resignation of Amit Shah

ఢిల్లీ అల్లర్ల వెనుక బీజేపీ కుట్ర దాగుందని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. దేశ రాజధానిలో చెలరేగుతున్న హింసను కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ తీవ్రంగా ఖండించారు . ముందస్తు ప్రణాళికతోనే అల్లర్లు సృష్టించారని విమర్శించారు. బీజేపీ నేత కపిల్ మిశ్రా ప్రసంగం రెచ్చగొట్టే విధంగా ఉందని ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్లే ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయని ఆరోపించారు. ఈ ఘటనలకు బీజేపీతో పాటు ఆప్‌ ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. 21 మంది మృతిచెందడం బాధాకరం అన్న సోనియా బాద్యత తీసుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అల్లర్లు జరుగుతుంటే కేజ్రీవాల్, అమిత్ షా ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు తగినంత భద్రతను మొహరించాలని కోరారు. సమస్యాత్మక ప్రాంతాలపై సీఎం కేజ్రీవాల్ దృష్టి పెట్టాలన్నారు. బాధితులకు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు సాయం చేయాలని సోనియా గాంధీ పిలుపునిచ్చారు.

Sonia Gandhi demands resignation of Amit Shah,Delhi, attacks , bjp , conspiracy , sonia gandhi, congress,amith shah ,union home minister, kejriwal , kapil mishra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here