షాను తొలగించాలని రాష్ట్రపతి వద్దకు సోనియా..

Sonia Gandhi meets President Ram Nath Kovind

సీఏఏ విషయంలో చెలరేగిన నిరసనలు ఢిల్లీలో హింసాత్మకంగా మారాయి . ఢిల్లీ హింసను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైన హోం మంత్రి అమిత్ షాను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఇక ఈ నేపధ్యంలోనే రాష్ట్రపతి రాం నాథ్  కోవింద్ ను కలిసి వినతి పత్రం అందజేశారు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ . తన విధుల నిర్వహణలో అమిత్ షా  వైఫల్యం చెందారని,  నగరంలో అల్లర్లు, ఘర్షణలను నివారించడంలో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం కూడా మౌన ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయని ఈ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దుయ్యబట్టారు. తమ పార్టీ ప్రతినిధిబృందంతో కలిసి ఆమె గురువారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. ఈ తరుణంలో మీ అధికారాలను ఉపయోగించి  ‘రాజధర్మాన్ని’  కాపాడాలని కోరుతూ ఆయనకు ఓ మెమోరాండం సమర్పించినట్టు ఆ తరువాత సోనియా తెలిపారు.  ఇంత జరుగుతున్నా..  బీజేపీ, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మౌన ప్రేక్షకులుగా వ్యవహరిస్తున్నాయని ఆమె విమర్శించారు. ఈ హింసాకాండ  దేశానికే సిగ్గు చేటని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఇలా ఉండగా గత ఆదివారం నగరంలో ప్రారంభమైన అల్లర్లు, ఘర్షణలు నాలుగురోజులుగా కొనసాగుతున్నాయి, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించినప్పటికీ.. పరిస్థితులు సాధారణ స్థితికి రాలేదు. ఇప్పటికి 130 మందిని అరెస్టు చేసినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఘర్షణల్లో మృతి చెందినవారి సంఖ్య 34 కి పెరగగా, 200 మందికి పైగా గాయపడ్డారు.

Sonia Gandhi meets President Ram Nath Kovind,delhi attacks , sonia gandhi, congress party, president , ramnath kovind , union minister amith shah, removal

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article