భారీ కెమెరాతో సోనీ నుంచి కొత్త ఫోన్?

SONY NEW PHONE

  • 25న మార్కెట్లోకి లాంచ్ అయ్యే అవకాశం

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు సోనీ నుంచి అద్భుతమైన ఫోన్ రాబోతోంది. ఏకంగా 52 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగిన కెమెరాను ఆ ఫోన్ లో పొందుపరిచినట్టు సమాచారం. అంతేకాకుండా దీంతోపాటు 16 మెగాపిక్సెల్ సామర్థ్యంలో కలిగిన మరో కెమెరాను కూడా వెనుకవైపు ఏర్పాటు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే 0.3 మెగాపిక్సెల్ సామర్థ్యం ఉన్న ఒక త్రీడీ కెమెరా కూడా ఉంది. అంటే వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉందన్నమాట. ఇక ముందువైపు 12 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగిన సెల్ఫీ కెమెరా ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈనెల 25న బార్సిలోనాలో జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఈ స్మార్ట్ ఫోన్ ను సోనీ ఆవిష్కరించనున్నట్టు చెబుతున్నారు. సోనీ ఎక్స్ పీరియా ఎక్స్ జెడ్-4 పేరుతో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ మార్కెట్లోకి వస్తే, అత్యధిక మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగిన స్మార్ట్ ఫోన్ ఇదే అవుతుంది. ఇప్పటివరకు హానర్ వ్యూ20, రెడ్‌మీ నోట్ 7 ఫోన్ల‌లోమాత్రమే 48 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగిన పెద్ద కెమెరా ఉంది. తాజాగా వీటి కంటే నాలుగు మెగాపిక్సెల్ ఎక్కువ సామర్థ్యం కలిగిన కెమెరాతో సోనీ దూసుకొస్తోంది. ప్రస్తుతానికి సోనీ ఎక్స్ పీరియా ఎక్స్ జెడ్-4కు సంబంధించి అధికారిక వివరాలేవీ అందుబాటులో లేవు. అయితే, వివిధ మాధ్యమాల్లో వస్తున్న వార్తల ప్రకారం ఈ ఫోన్ 6.5 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంది. 6 జీబీ ర్యామ్ తోపాటు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4400 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉన్నాయి.

MOBILE MARKET

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article