South Sudan boy given life
ఆఫ్రికా మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల రోగులకు అత్యంత నమ్మకమైన సమగ్ర వైద్యసేవలందించే నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో వైద్యులు ఐదేళ్ల బాలుడికి సంక్లిష్టమైన గుండె శస్త్రచికిత్స చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. దక్షిణ సూడాన్ దేశానికి చెందిన ఐదేళ్ల వయస్సు గల బాలుడు విక్టర్ బియోర్ ఆపరేషన్ అనంతరం తన తల్లితో కలిసి సంపూర్ణ ఆరోగ్యంతో గురువారం స్వదేశానికి తిరిగి వెళ్లాడు. పుట్టుకతోనే గుండె జబ్బులతో ఇబ్బంది పడుతుండడంతో మూడు వారాల క్రితం బాలుడి తల్లిదండ్రులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేర్పించారు.
గుండెలో రంధ్రం, మరియు గుండెకు రక్తాన్ని సరఫరా చేసే దమనులు సంకోచించడం ద్వారా రక్తనాళాలు సన్నబడి తలెత్తే సమస్యలతో పాటు ఇతర గుండె సమస్యలతో సూడాన్‌కు చెందిన బాబును తల్లి మిసెస్ మాగ్డలీన్ అయెన్ డెంగ్ పాన్యాం కాంటినెంటల్ ఆస్పత్రిలో చేర్పించింది. సాధారణంగా గుండెలోని దమనులు సంకోచించడం ద్వారా ఊపిరితిత్తులకు రక్త సరఫరాను తగ్గిస్తుంది. అదే విధమైన క్లిష్టమైన గుండె సమస్యలతో బాలుడి ఆరోగ్యం ప్రమాదంలో పడింది. దీంతో వెంటనే శస్త్ర చికిత్స చేయవలసి వచ్చింది. ఈ ఆపద సమయంలో కాంటినెంటల్ డాక్టర్లు వెంటనే స్పందించి ఆపరేషన్ చేసి బాలుడి ప్రాణాలను కాపాడారు.
ఈ సందర్భంగా బాలుడికి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన కాంటినెంటల్ ఆస్పత్రి సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ ప్రదీప్ రాచకొండ వివరించారు. “విక్టర్ కేవలం మూడు నెలల వయసులోనే పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో ఇబ్బంది పడుతున్నాడు. దాంతో క్రమంగా వయస్సు పెరుగుతుండడంతో గుండె సమస్య కూడా తీవ్రమవుతూ వచ్చింది. దానికి తోడు గుండెలోని దమనులు వయస్సు పెరిగే కొద్ది సన్నబడుతూ రావడంతో ఇరుకుగా మారి ఊపిరి తిత్తులకు రక్తసరఫరా ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి తలెత్తింది. దీంతో బాలుడికి ఓపెన్ హార్ట్ సర్జరీ అనివార్యమైంది. 3 వారాల క్రితం బాలుడు ఆస్పత్రిలో చేరగానే పరిస్థితిని గమనించి వెంటనే ఓపెన్ హార్ట్ సర్జరీ చేశాం. సర్జరీ చేసిన అనంతరం నుంచి గత మూడు వారాలుగా నిత్యం బాలుడి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నాం. ఇక పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా తయారు కావడంతో డిశ్చార్జి చేస్తున్నాం.“ అని డాక్టర్ ప్రదీప్ రాచకొండ వివరించారు.
“కాంటినెంటల్ ఆస్పత్రి నేడు దేశంలోనే సమగ్ర వైద్యసేవలందించే ఆస్పత్రులలో ఒకటి. ఈ ఆస్పత్రిలో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న రోగులకైనా , ఎలాంటి సంక్లిష్టమైన సమస్యలతో బాధపడేవారికైనా చికిత్సలు అందిస్తున్నాం. మా ఆస్పత్రి నిపుణుల బృందం అరుదైన శస్త్రచికిత్సలు చేయడమే కాదు, వారిని మానసిక, ఆర్థిక పరిస్థితులను కూడా గమనించి సేవలందిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. బాలుడు విక్టర్ బియోర్ సంపూర్ణ ఆరోగ్యంతో తన జన్మస్థలమైన సూడాన్‌కు తిరిగి వెళ్లడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ బాలుడు ఇక మీదట ఎటువంటి గుండె సంబంధిత సమస్యలు లేకుండా జీవించేలా డాక్టర్లు చికిత్స నందించారు. ”అని కాంటినెంటల్ ఆస్పత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ రియాజ్ ఖాన్ అన్నారు.
పుట్టుకతో వచ్చే గుండెకు సంబంధించిన లోపాలు, కారణాలు వెంటనే తెలియవు. అయితే ఇవి తలెత్తడానికి తల్లి గర్భధారణ సమయంలో రుబెల్లా, కొన్నివాడకూడని మందులు వాడడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి. అయితే ఏదేమైన పుట్టుకతో వచ్చే గుండె సంబంధించిన వ్యాధులు చాలా ప్రమాద కరం. అయితే ముఖ్యంగా మేనరిక వివాహాలు చేసుకున్న వారి పిల్లలకు ఇటువంటి ప్రమాదాలు ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంది. అయితే ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది పిల్లలు ఇటువంటి గుండె సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారు. దురదృష్టవషాత్తు వీరిలో కొంత మందికి ఉత్తమ చికిత్స అందడం ద్వారా బతికి బయటపడుతున్నారు. మెజారిటీగా ప్రాణాలు కోల్పోతున్నారు.