ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి మాతృవియోగం

SP BALU MOTHER DIED

ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాతృమూర్తి శకుంతలమ్మ(89) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఓ సంగీత కార్యక్రమంలో పాల్గొనేందుకు లండన్ వెళ్లిన ఎస్పీ బాలు.. విషయం తెలిసిన వెంటనే భారత్ కు బయలుదేరారు. మంగళవారం నెల్లూరులో శకుంతలమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. పలువురు సినీ ప్రముఖులు బాలసుబ్రహ్మణ్యానికి సంతాపం తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article