Spain flue is effected in Hyderabad.. పెరుగుతున్న మృతులు
చలి తీవ్రత పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రం లో చాలా జిల్లాల్లో ప్రజలకు స్వైన్ ఫ్లూ భయం పట్టుకుంది. విపరీతమైన చలితో అస్వస్థతకు గురవుతున్న ప్రజలు ఆసుపత్రుల బాట పడుతున్నారు. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ కేసులు నమోడు అవుతున్నాయి. ఇక తాజాగా భూపాలపల్లి జిల్లాలో స్వైన్ ఫ్లూ తో మాజీ ఎంపిటిసి రాజ వీరు మృతిచెందడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాసులు భయాందోళనలకు గురవుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ లో కూడా స్వైన్‌ఫ్లూ మళ్లీ పంజా విసురుతోంది. ఇటీవల వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులకు తోడు చలితీవ్రత వల్ల ఫ్లూ కారక వైరస్ విజృంభిస్తోంది. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ ప్రస్తుతం గాంధీ జనరల్ ఆస్పత్రిలో ఎనిమిది మంది చికిత్స పొందు తున్నారు. ఉస్మానియాలో ఐదు స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే గతేడాది గాంధీలో 72 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో 18 మంది మృత్యువాత పడ్డారు. 54 మంది చికిత్స తర్వాత కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఉస్మానియాలో 33 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో 11 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో అత్యధిక శాతం మహిళలే ఉండటం గమనార్హం.
ఇక రేగొండ మండలంలోని దమ్మన్నపేట మాజీ ఎంపీటీసీ బక్కెర రాజవీరుస్వైన్ ఫ్లూతో మృతి చెందాడు. చలి తీవ్రత పెరగడంతో రాజవీరు ఒక్కసారిగా అస్వస్థతకు గురైనట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం చికిత్స నిమిత్తం హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించామని, అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు స్వైన్‌ఫ్లూగా నిర్ధారించినట్లు చెప్పారు. నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మృత్యువాత పడినట్లు తెలిపా రు. రాజవీరుకు భార్య, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా, రాజవీరు మృతి గ్రామంలో విషాదం నింపింది. 2001 నుంచి 2004 వరకు దమ్మన్నపేటఎంపీటీసీగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కేయూలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు.
ఇక ఈ నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాసులు స్వైన్ ఫ్లూ వ్యాప్తి చెందుతుంది ఏమో అని భయాందోళనలో ఉన్నారు. అయితే వైద్య శాఖ అధికారులు అప్రమత్తమై స్వైన్ ఫ్లూ కేసులను గుర్తించి వైద్య సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.