Spammy watts War
- బాలల అశ్లీల దృశ్యాలు షేర్ చేసుకున్న ఖాతాల తొలగింపు
- పది రోజుల్లో 1.30 లక్షల ఖాతాలు తొలగించిన వాట్సాప్
అశ్లీలతపై ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ యుద్ధం ప్రకటించింది. బాలల అశ్లీల చిత్రాలను షేర్ చేసినందుకు తమ యాప్ లోని 1.30 లక్షల ఖాతాలను వాట్సాప్ తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా భారత్ సహా పలు దేశాలకు చెందిన వినియోగదారులు బాలల అశ్లీలతకు సంబంధించిన దృశ్యాలు, వీడియోలు షేర్ చేసుకున్నట్టు తెలియడంతో, ఇందుకు సంబంధించి 10 రోజుల వ్యవధిలో లక్షా ముప్పై వేల ఖాతాలను తొలగించింది. వాస్తవానికి ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్టన్ కారణంగా వాట్సాస్ యూజర్లు ఏమి పంపించుకుంటున్నారో వాట్సాప్ సహా మూడో వ్యక్తికి సాధ్యపడదు. అయితే వినియోగదారుల ప్రొఫైల్ చిత్రాలు, గ్రూప్ ప్రొఫైల్ చిత్రాలు, గ్రూప్‌లకు సంబంధించిన ఇతర సమాచారం ఎన్‌క్రిప్ట్ కావు. వీటిని బట్టి ఏఐ సాంకేతికత ద్వారా యాప్‌ను దుర్వినియోగం చేస్తున్నవారిని వాట్సాప్ గుర్తిస్తోంది. ఈ విధానంలోనే బాలల అశ్లీలత వీడియోలు షేర్ చేసుకున్న వారిని గుర్తించి చర్యలు చేపట్టింది.