నాని చిత్రంలో స్పెష‌ల్‌సాంగ్‌

SPECIAL SONG IN NANI MOVIE
నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడుగా రూపొందుతోన్న చిత్రం `జెర్సీ`. ఏప్రిల్ 19న సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.  `మ‌ళ్ళీరావా` ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం టీజ‌ర్ రీసెంట్‌గా రిలీజై మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. టీజ‌ర్ చూస్తే 36 ఏళ్ల వ్య‌క్తి ఇండియ‌న్ క్రికెట్ టీమ్‌లో చోటు సంపాదించుకోవ‌డానికి చేసే ప్ర‌య‌త్నం.. ఆ క్ర‌మంలో జ‌రిగే ప‌రిస్థితులు, ఎమోష‌న్స్ ఆధారంగా సినిమా న‌డుస్తుంది. ఇది వింటుంటే హాలీవుడ్ చిత్రం ఇన్విన్సిబుల్ ఆధారంగా తెర‌కెక్కిస్తున్నార‌ని కూడా వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో ఆదాశ‌ర్మ ఓ ప్ర‌త్యేక‌గీతంలో న‌టించ‌బోతున్నార‌ట‌. హార్ట్ ఎటాక్ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీఇచ్చిన ఆదాశ‌ర్మ‌.. త‌దుప‌రి కొన్ని త‌మిళ చిత్రాల్లో కూడా న‌టించింది. ఈమె సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article